Wedding: ఖండాలా ఫామ్‌హౌస్‌లో అతియా,కేఎల్ రాహుల్‌ల వివాహం

ABN , First Publish Date - 2023-01-23T08:44:07+05:30 IST

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి,ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను సోమవారం వివాహం....

Wedding: ఖండాలా ఫామ్‌హౌస్‌లో అతియా,కేఎల్ రాహుల్‌ల వివాహం
Athiya Shetty, KL Rahul wedding

ముంబయి: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి,ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను సోమవారం వివాహం చేసుకోనున్నారు.(Athiya Shetty, KL Rahul) నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో(relationship) ఉన్న ఈ సెలబ్రిటీ జంట ఖండాలాలోని(Khandala farmhouse) సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో సోమవారం మధ్యాహ్నం పెళ్లి చేసుకోనున్నారు.(wedding) అతియా,కేఎల్ రాహుల్ జంట సోమవారం సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేయనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆచారాలను అనుసరించి ఈ జంట వివాహం చేసుకోనున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ఫొటోలకు పోజులివ్వనున్నారు.

జనవరి 21వతేదీన ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.22వతేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి.పెళ్లి తర్వాత అతియా, కేఎల్ రాహుల్ జంట ముంబయి, బెంగళూరు నగరాల్లో తమ స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.అతియా శెట్టి చివరిగా 2019 చిత్రం మోతీచూర్ చక్నాచూర్‌ సినిమాలో నటించింది. అతియా 2015వ సంవత్సరంలో సూరజ్ పంచోలి సరసన హీరోతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Updated Date - 2023-01-23T09:06:31+05:30 IST