Delivery Boy Success Story: సాధించావ్ బ్రో.. నిన్నటిదాకా ఈ కుర్రాడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి..!

ABN , First Publish Date - 2023-07-25T16:02:30+05:30 IST

జీవితంలో కోరుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే విజయం సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఏ పని చేస్తున్నా లక్ష్యంపై ధ్యాస ఉంటే దానిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ఈ మాటలను మీరు నమ్మడం లేదా? అయితే తమిళనాడుకు చెందిన జొమాటో డెలివరీ బాయ్ విఘ్నేష్ కథ తెలుసుకోవాల్సిందే.

Delivery Boy Success Story: సాధించావ్ బ్రో.. నిన్నటిదాకా ఈ కుర్రాడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి..!

జీవితంలో కోరుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే విజయం సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఏ పని చేస్తున్నా లక్ష్యంపై ధ్యాస ఉంటే దానిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ఈ మాటలను మీరు నమ్మడం లేదా? అయితే తమిళనాడు (Tamilnadu)కు చెందిన జొమాటో డెలివరీ బాయ్ (Zomato Delivery Boy) విఘ్నేష్ కథ తెలుసుకోవాల్సిందే. జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తూనే విఘ్నేష్ కష్టపడి చదువుకున్నాడు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడు గవర్నమెంట్ అధికారి అయ్యాడు (Delivery Boy Success Story).

తమ ఉద్యోగి సాధించిన విజయాన్ని జొమాటో కంపెనీ ప్రపంచంతో గర్వంగా పంచుకుంది. విఘ్నేష్ కథ సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Story)గా మారింది. పేద కుటుంబంలో జన్మించిన విఘ్నేష్‌కు ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం (Government Job) సంపాదించాలనే కోరిక ఉండేది. అయితే సంపాదన కోసం జొమాటో సంస్థలో డెలివరీ బాయ్‌గా చేరాడు. పగలంతా పని చేసి, రాత్రి వేళల్లో చదువుకునే వాడు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించాడు. తన కలను నెరవేర్చుకున్నాడు. విఘ్నేష్ విజయం గురించి జొమాటో సంస్థ ట్వీట్ చేసింది.

Viral: ఎవరీ పెద్దాయన..? ఏరికోరి మరీ ఈ వృద్ధుడి గురించి ఆనంద్ మహీంద్రా ఎందుకు పోస్ట్ చేశారంటే..!

జొమాటో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు లక్ష మంది ఆ ట్వీట్ చూశారు. 4 వేల మంది లైక్ చేశారు. కష్టపడి తన కల నెరవేర్చుకున్న విఘ్నేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంకిత భావం ఉంటే ఏమైనా సాధించవచ్చని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విఘ్నేష్ ఎంతో మందికి స్ఫూర్తి అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-25T16:02:30+05:30 IST