షాకింగ్ సీన్.. రెస్టారెంట్‌ ముందు టిఫిన్ తింటోందో యువతి.. 20వ అంతస్తు పైనుంచి కిందకు దూకేసిన టెకీ.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-04T17:38:15+05:30 IST

ఆ ప్రాంతమంతా జనంతో రద్దీగా ఉంది. అంతా ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్ ముందు ఓ యువతి టిఫిన్ తింటూ ఉంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా.. పక్కనే ఉన్న బిల్డింగ్ లోని 20వ అంతస్తు నుంచి..

షాకింగ్ సీన్.. రెస్టారెంట్‌ ముందు టిఫిన్ తింటోందో యువతి.. 20వ అంతస్తు పైనుంచి కిందకు దూకేసిన టెకీ.. చివరకు..

ఆ ప్రాంతమంతా జనంతో రద్దీగా ఉంది. అంతా ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్ ముందు ఓ యువతి టిఫిన్ తింటూ ఉంది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా.. పక్కనే ఉన్న బిల్డింగ్ లోని 20వ అంతస్తు నుంచి ఓ వ్యక్తి అమాంతం దూకేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ అంతా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా పరిధి సోనిపట్ ప్రాంతానికి చెందిన సుమన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (software job) చేస్తుండేవాడు. అయితే కొన్ని నెలలుగా వర్క్ ఫ్రం హోమ్ (Work from home) చేస్తున్నాడు. ఇదిలావుండగా, సుమన్ తన స్కూల్ మేట్ అయిన యువతిని (young woman) ప్రేమిస్తుండేవాడు. ఆమె ప్రస్తుతం కళాశాలలో టీచర్‌గా పని చేస్తోంది. కాగా, ఈమె త్వరలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వీసా దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 2న ఢిల్లీకి వచ్చింది. అక్కడ ఇద్దరూ కలిశారు. తర్వాతి రోజు అక్కడి నుంచి నోయిడా వచ్చి, స్థానిక గోల్డెన్ పామ్ సొసైటీ సెక్టార్-168లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. రాత్రి సుమన్ ఫుల్‌గా మద్యం సేవించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏదో విషయమై గొడవ (quarrels) జరిగింది.

Viral Video: అప్పటిదాకా ఉన్న టేబుల్ క్లాత్.. కాసేపటికే యువతి డ్రస్సుగా ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

man-death.jpg

మాటామాటా పెరగడంతో ఆమె కోపంగా బయటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమన్.. 20వ అంతస్తు నుంచి అమాంతం కిందకు (suicide) దూకేశాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కింద భోజనం చేస్తున్న గుర్తు తెలియని యువతిపై పడడంతో.. ఆమెకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమన్ బస చేసిన గదిలో పరిశీలించగా మద్యం సీసాలు, గంజాయి బయటపడ్డాయి. సుమన్ ప్రియురాలిని (girlfriend) అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతన్నాయని, పూర్తి విచారణ అనంతరం అసలైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Viral Video: వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-02-04T17:39:35+05:30 IST