Viral Video: అప్పటిదాకా ఉన్న టేబుల్ క్లాత్.. కాసేపటికే యువతి డ్రస్సుగా ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

ABN , First Publish Date - 2023-02-04T14:55:36+05:30 IST

ఫ్యాషన్ షోలో యువతులు వివిధ రకాల డ్రస్సులు వేస్తూ క్యాట్ చేయడం చూస్తుంటాం. కొందరైతే చిత్ర విచిత్రమైన డ్రస్సులు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..

Viral Video: అప్పటిదాకా ఉన్న టేబుల్ క్లాత్.. కాసేపటికే యువతి డ్రస్సుగా ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

ఫ్యాషన్ షోలో యువతులు వివిధ రకాల డ్రస్సులు వేస్తూ క్యాట్ చేయడం చూస్తుంటాం. కొందరైతే చిత్ర విచిత్రమైన డ్రస్సులు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టకుంటోంది. ఓ ఫ్యాషన్ షోలో ఓ యువతి వేసుకున్న డ్రస్సు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

డెన్మార్క్ (Denmark) కోపెన్‌హాగన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నిర్వహించిన ప్యాషన్ షోలో (Passion show) ఓ యువతి డ్రస్సు అందరినీ ఆకట్టుకుంటోంది. చె నాన్నా, సైమన్ విక్ అనే ఇద్దరు డిజైనర్లు ఈ డ్రస్సును రూపొందించారు. ఫ్యాషన్ షోలో యువతులంతా (young women) వివిధ రకాల డ్రస్సులతో క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఓ యువతి టేబుల్ వద్ద కూర్చుని ఉంటుంది. అందరిలో పాటూ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటుంది. కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిందేమో అని అంతా అనుకుంటారు.

జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న వాళ్ల సంఖ్య మరీ ఈ రేంజ్‌లో ఉందా..? ఆ డేటింగ్ యాప్‌ ఏం తేల్చిందంటే..

కానీ కాసేపటి తర్వాత.. స్పూన్‌తో గాజు గ్లాజును కొట్టి చప్పుడు చేస్తుంది. వెంటనే పైకి లేచి క్యాట్ వాక్‌కు (Cat walk) రెడీ అవుతుంది. అయితే అప్పటిదాకా టేబుల్‌పై ఉన్న క్లాత్.. ఒక్కసారిగా యువతి డ్రస్సుగా మారిపోతుంది. డ్రస్సుపై ఉన్న ప్లేట్లు, గ్లాసులన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్తుంది. పొడవాటి డ్రస్సును ముందే లేబుల్‌పై క్లాత్‌లా ఏర్పాటు చేసి, తర్వాత దాన్ని లాక్కుంటూ క్యాట్ వాక్ చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-02-04T15:07:10+05:30 IST