Vishwak Sen : ఆగష్టు 15న శుభవార్త చెప్పనున్న విశ్వక్ సేన్.. పెళ్లి చేసుకోబోతున్నాడా..?

ABN , First Publish Date - 2023-08-13T21:48:40+05:30 IST

టాలీవుడ్ యువ హిరో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తాను జీవితంలో కొత్త దశలోకి అడుపెట్టబోతున్నానేది ఆ పోస్టు సారాంశం. పూర్తి వివరాలను ఆగష్టు 15న వెల్లడిస్తానని ఆ పోస్టుకు క్యాప్షన్‌గా కూడా పెట్టాడు.

Vishwak Sen : ఆగష్టు 15న శుభవార్త చెప్పనున్న విశ్వక్ సేన్.. పెళ్లి చేసుకోబోతున్నాడా..?

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తాను జీవితంలో కొత్త దశలోకి అడుపెట్టబోతున్నానేది ఆ పోస్టు సారాంశం. పూర్తి వివరాలను ఆగష్టు 15న వెల్లడిస్తానని ఆ పోస్టుకు క్యాప్షన్‌గా కూడా పెట్టాడు. దీంతో అది పెళ్లి వార్తే అయి ఉంటుందని అభిమానులంతా చర్చించుకుంటున్నారు. అసలు విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆ పోస్టులో ఏం ఉందంటే..‘‘ఇన్ని సంవత్సరాలుగా నాపై చూపించిన ప్రేమ, మద్దతుకుగాను నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రస్తుతం నేను నా జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. నేను త్వరలోనే ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. మీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చాడు.


అయితే ఈ పోస్ట్ చూసిన కొందరు విశ్వక్ సేన్‌కు అభినందనలు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఇది పెళ్లి వార్త అయి ఉండకపోవచ్చని అంటున్నారు. తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగానే విశ్వక్ ఇలా చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా విశ్వక్ సేన్ చేసిన ఈ పోస్ట్‌పై పూర్తి స్పష్టత రావాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే. ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణచైతన్య తెరకెక్కిస్తున్నాడు. నేహా శెట్టి హిరోయిన్ కాగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా విశ్వక్ సేన్ నటించిన చివరి చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం గతేడాది విడుదలైంది. ఆ తర్వాత విశ్వన్ నటిచంచిన ‘బూ’ అనే సినిమా నేరుగా ఓటీటీలో మే నెలలో విడుదలైంది.

Updated Date - 2023-08-13T22:39:40+05:30 IST