Viral Video: మెట్రో రైల్లో మరో షాకింగ్ సీన్.. ఓ మహిళతో గొడవ పడుతూనే కంగారుగా బ్యాగులో ఏదో వెతుకుతున్న యువతి.. చివరకు..!

ABN , First Publish Date - 2023-04-04T17:27:58+05:30 IST

అది మెట్రో రైలు. అంత రద్దీగా కూడా లేదు. కూర్చువడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఉన్నట్టుండి ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. ట్రైన్‌లో ఉన్నవాళ్లంతా అలానే చూస్తున్నారు. ఇంతలో ఓ యువతి బ్యాగులోంచి వస్తువు బయటకు తీసి

Viral Video: మెట్రో రైల్లో మరో షాకింగ్ సీన్.. ఓ మహిళతో గొడవ పడుతూనే కంగారుగా బ్యాగులో ఏదో వెతుకుతున్న యువతి.. చివరకు..!
Viral Video

అది మెట్రో రైలు. అంత రద్దీగా కూడా లేదు. కూర్చువడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఉన్నట్టుండి ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. ట్రైన్‌లో ఉన్నవాళ్లంతా అలానే చూస్తున్నారు. ఇంతలో ఓ యువతి బ్యాగులోంచి వస్తువు బయటకు తీసి చేయకూడని పని చేసింది. ఇంతకీ వారిద్దరూ ఎందుకు గొడవపడ్డారు? బ్యాగులోంచి ఆ యువతి తీసింది ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సోషల్ మీడియా (Social media) వచ్చాక ప్రతీది నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతున్నాయో చెప్పలేం. ఒకప్పుడు గోప్యంగా ఉండే కొన్ని సంఘటనలు... సోషల్ మీడియా పుణ్యమా అంటూ నెట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల రైల్లో జరుగుతున్న చిత్ర విచిత్ర సంఘటనలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవకు (passenger fights) సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వాళ్లెందుకు గొడవ పడ్డారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

మెట్రో (Metro rail)లో మహిళలకు కూర్చోవటానికి సరిపడా సీటు ఉంది. ట్రైన్ కూడా అంత రష్‌గా కూడా లేదు. దూరం.. దూరంగానే కూర్చుని ఉన్నారు. అయినా కూడా వారిద్దరూ వాదులాడుకున్నారు. ఇంతలో ఓ మహిళ (Woman).. నోరు మెదపకుంటే కొడతానంటూ యువతిని హెచ్చరించింది. అంతే కోపంతో రగిలిపోయిన ఆ యువతి బ్యాగులోంచి పెప్పర్ స్ప్రే (pepper spray) బయటకు తీసింది. ఎక్కువ మాట్లాడితే స్ప్రే చేస్తానంటూ బదులుగా హెచ్చరించింది. అంతే ఇలా ఒకరికొకరు రెచ్చిపోయి కొట్టుకొనేంత వరకూ వెళ్లిపోయారు. ఇద్దరు చేతులు పట్టుకుని పెనుగులాడారు. ఇంతలో యువతి హెచ్చరించినట్టుగానే స్ప్రేను మహిళపై కొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Viral Video)లో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Marriage Gift Kills Groom: పెళ్లికి వచ్చిన బహుమతే.. ఆ వరుడి ప్రాణాలను తీసేసింది.. పెళ్లయిన రెండ్రోజుల తర్వాత గిఫ్టులను బయటకు తీసి..

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-04T17:27:58+05:30 IST