అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించింది.. ప్రియుడిని బుక్ చేయాలనుకుని బుక్ అయింది..

ABN , First Publish Date - 2023-02-06T20:49:27+05:30 IST

ప్రేమించిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి చేసిన పని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాత్రంతా వారిని పరుగులు పెట్టించింది.. ప్రియుడిని ఇరుకున పెట్టేందుకు ఆ యువతి నాటకం ఆడినట్టు తెలుసుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు..

అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించింది.. ప్రియుడిని బుక్ చేయాలనుకుని బుక్ అయింది..

ప్రేమించిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి చేసిన పని పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాత్రంతా వారిని పరుగులు పెట్టించింది.. ప్రియుడిని ఇరుకున పెట్టేందుకు ఆ యువతి నాటకం ఆడినట్టు తెలుసుకున్న పోలీసులు విస్మయానికి గురయ్యారు.. తమిళనాడులోని (TamilNadu) కాంచీపురంలో ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.

శనివారం రాత్రి కాంచీపురం (Kancheepuram) జిల్లా పాలవాక్కంలో ఓ యువతి గాయాలతో పరుగులు పెడుతూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. తనపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. దీంతో ఆ ఇంట్లో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెంగల్పట్టు రైల్వే స్టేషన్ (Chengalpattu railway station) నుంచి తనను నలుగురు యువకులు కిడ్నాప్ చేశారని, వారి పేర్లను ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఆ యువతిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు, సమీప ప్రాంతాల్లో రాత్రంతా గాలింపులు చేపట్టారు. చివరకు చెంగల్పట్టు స్టేషన్ పరిధిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

Viral Video: ఈ కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకుందంటే..

ఆ యువతి చెంగల్పట్టు స్టేషన్ సమీప ప్రాంతంలో ఓ యువకుడితో కలిసి బైక్ మీద వెళుతున్నట్టు సీసీటీవీ కెమేరాలో కనిపించింది. కొద్ది నిమిషాల వ్యవధిలో గాయాలతో ఆ యువతి పరుగులు పెడుతున్నట్టు కనిపించడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. అలాగే యువతి చెప్పిన వ్యక్తుల మొబైల్ నెంబర్లను ట్రేస్ చేయగా ఒకరు కన్యాకుమారిలోనూ, మరొకరు మధురైలోనూ, మరొకరు చెన్నైలోనూ ఉన్నట్టు తేలింది. దీంతో ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తాను సలీం అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడు తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని, దాంతో అతడిని, అతడి స్నేహితులను ఇరికించేందుకు అలా చేశానని యువతి చెప్పింది (Fake Story). దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-06T20:49:28+05:30 IST