Viral Video: ఈ కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకుందంటే..

ABN , First Publish Date - 2023-02-06T18:53:24+05:30 IST

ఇతర జీవాలతో పోల్చుకుంటే శునకాలు మనుషులకు బాగా చేరువ అవుతాయి. వారు చెప్పేవాటిని అర్థం చేసుకోగలుగుతాయి. అంతేకాదు కాస్తంత తెలివి తేటలను కూడా ప్రదర్శస్తాయి. తాజాగా ఓ కుక్క ఉపాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

Viral Video: ఈ కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకుందంటే..

ఇతర జీవాలతో పోల్చుకుంటే శునకాలు మనుషులకు బాగా చేరువ అవుతాయి. వారు చెప్పేవాటిని అర్థం చేసుకోగలుగుతాయి. అంతేకాదు కాస్తంత తెలివి తేటలను కూడా ప్రదర్శస్తాయి. తాజాగా ఓ కుక్క ఉపాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది (Dog miraculously escapes from death). ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Avinash Shishoo అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఓ కుక్క రైలు పట్టాల (Railway Track) మధ్య పడుకుని ఉంది. దాని పై నుంచి రైలు (Train) వేగంగా వెళుతోంది. రైలు వెళుతున్నంత సేపు ఆ కుక్క పట్టాల మధ్య అలా కూర్చునే ఉండిపోయింది. రైలు వెళ్లిపోయిన తర్వాత దర్జాగా బయటకు నడుచుకుంటూ వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి ప్రాణాలతో బయటపడిన కుక్క తెలివి తేటలకు షాకవుతున్నారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-02-06T18:53:26+05:30 IST