Wife: వామ్మో.. ఈ భార్య మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదుగా.. భర్త చావుకు కారణమేంటో డాక్టర్లు కూడా తేల్చలేకపోతున్నారు.. అసలు కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-05-25T17:34:04+05:30 IST

భార్య తెలివిగా చేసిన పనికి భర్త మరణించాడు.. విచారణ చేపట్టిన పోలీసులకు అతను ఎలా మరణించాడో ఓ పట్టాన అర్థం కాలేదు. ఎన్నో కేసులు చేధించిన ఆ పోలీసులే..

Wife: వామ్మో.. ఈ భార్య మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదుగా.. భర్త చావుకు కారణమేంటో డాక్టర్లు కూడా తేల్చలేకపోతున్నారు.. అసలు కథేంటంటే..!

కలికాలం కదా భార్య భర్తను చంపడం, భర్త భార్యను హతమార్చడం వంటి దారుణమైన సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. ఓ మహిళకు తన భర్త నుండి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇబ్బందులు తప్పించుకోవాలని ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. అతనికి కూడా అనుమానం రాకుండా తన ప్రణాళిక అమలు పరిచింది. ఆమె ప్లాన్ ఫలితంగా అతను మరణించాడు. అయితే అతని మరణం గురించి విచారణ చేపట్టిన పోలీసులకు అతను ఎలా మరణించాడో ఓ పట్టాన అర్థం కాలేదు. ఎన్నో కేసులు చేధించిన ఆ పోలీసులే ఆ మహిళ చేసిన పని చూసి ఆశ్చర్యపోయారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా(Australia) దేశం విక్టోరియా(Victoria) రాష్ట్రంలో వాల్ప్యూన్ అనే చిన్న పట్టణంలో నోయల్ పేన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు రెబెక్కా. నోయల్ పేన్ పెద్ద శాడిస్ట్sadist husband). అతను రెబెక్కాను నిరంతరం కొట్టడం, తిట్టడం, ఆమెను అత్యాచారం చెయ్యడం(husband beaten, scolding, raped his wife) చేసేవాడు. దీంతో రెబెక్కా ప్రత్యక్ష నరకం చూసేది. ఇదిలా ఉండగా నోయల్ ఒకరోజు ఓ కొత్త మహిళను ఇంటికి తీసుకెళ్ళాడు. 'ఈమె నా గర్ల్ ఫ్రెండ్, ఇక్కడే ఉంటుంది' అని చెప్పాడు. అప్పటికీ రెబెక్కా అతడిని ఏమీ అనలేదు. కానీ నోయల్ రెబెక్కాతో పాటు కొత్తగా తీసుకొచ్చిన అమ్మాయిపైన కూడా అత్యాచారం చెయ్యడం, ఇద్దరు మహిళలను హింసించడం చేసేవాడు. దీంతో రెబెక్కాకు అతనిమీద అసహ్యం పెరిగిపోయింది. అతను ఇంటికి రాగానే పెట్టే చిత్రహింసలు గుర్తొచ్చి వణికిపోయేది. ఈ క్రమంలో ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నిద్రమాత్రలు(sleeping pills) తీసుకొచ్చి వాటిని ఐసింగ్ షుగర్ లా మార్చి దాంతో బిస్కెట్లు తయారుచేసింది. వాటిని తన భర్తకు అందించింది. అతను వాటిని తినేశాడు(husband eat sleeping pill biscuits).

Snake vs Monkey: కోతి చేష్టలంటే ఇవే మరి.. పడగవిప్పి బుసలు కొడుతున్నా.. పాము తోకను పదే పదే లాగుతున్న కోతి.. చివరకు..!


నిద్రమాత్రలు కలిపిన బిస్కెట్లు తినడంతో అతను నిద్రలోకి జారుకుంటాడని, తనకు అతని చేతిలో హింస తప్పుతుందని ఆమె అనుకుంది. కానీ అతను బిస్కెట్లు తిన్న వెంటనే స్పృహ కోల్పోయాడు(loss consciousness). అది చూసి ఆమె భయపడింది. అతను చచ్చిపోయాడనుకుంది. విషయం బయటపడితే ప్రమాదమని అతన్ని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది. అయితే ఆమె ఎంతదాచాలని చూసినా విషయం దాగలేదు. అతని మరణం గురించి విచారిస్తున్న పోలీసులు అతను నిద్రమాత్రలు కలిపిన బిస్కెట్లు తిని చనిపోయాడా? లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల చనిపోయాడా? అనే కారణం తేల్చలేకపోయారు. పోలీసులు రెబెక్కాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసల గురించి కోర్టువారికి వివరించింది. అసభ్యకర వీడియోలు పెట్టి వాటిని చూడమని బలవంతం చెయ్యడం, అతను చెప్పినట్టు వినకపోతే రెబెక్కాను సిగరెట్ తో కాల్చడం, ఆమె మీద పదే పదే ఉమ్మివేయడం లాంటి పనులు చేసేవాడని ఆధారాలు కూడా చూపించింది. ఎంతో మంది అమ్మాయిలను అత్యాచారం చేశాడని, అమ్మాయిలను కేవలం వస్తువులుగా చూసేవాడిని పేర్కొంది. కాగా భర్తను చంపినందుకుగానూ రెబెక్కాకు జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

Viral News: పురిటి నొప్పులు వస్తున్నాయని భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. బిడ్డను భర్త చేతిలో పెట్టినట్టే పెట్టి భారీ షాకిచ్చారు..!


Updated Date - 2023-05-25T17:34:04+05:30 IST