Viral Video: ఇలాంటోళ్లకు ఇలాగే జరగాలి.. కుక్కను హింసిస్తూ కుర్రాళ్ల వికృతానందం.. మరుక్షణంలోనే మైండ్‌బ్లాకయ్యే సీన్..!

ABN , First Publish Date - 2023-05-23T20:08:06+05:30 IST

ఇద్దరు కుర్రాళ్ళు పెంపుడు కుక్క విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. కుక్కను కొడుతూ వారు వికృతానందం అనుభవించారు. అయితే వారు కుక్కను కొట్టగానే ఊహించని సంఘటన చోటుచేసుకుంది

Viral Video: ఇలాంటోళ్లకు ఇలాగే జరగాలి.. కుక్కను హింసిస్తూ కుర్రాళ్ల వికృతానందం.. మరుక్షణంలోనే మైండ్‌బ్లాకయ్యే సీన్..!

జంతువులన్నింటిలోకి కుక్కలు మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి. అవి చాలా విశ్వాసాన్ని చూపిస్తాయి. కొందరు జంతువుల పట్ల సానుభూతి చూపిస్తే మరికొందరు మనసులేకుండా వికృతంగా ప్రవర్తిస్తుంటారు. పెంపుడు కుక్క(pet dog) పట్ల ఇద్దరు కుర్రాళ్ళు ఇలాగే చేశారు. దారిన పోయే కుక్కల్ని ఏమైనా అంటే అవి అరుస్తాయి, మీద పడి కరుస్తాయి. కానీ పెంపుడు కుక్కలు అయితే నిందించినా, కొట్టినా కుయ్యి కుయ్యిమని అరుస్తూ బాధతో ఓ మూలన కూర్చుంటాయి. ఇద్దరు కుర్రాళ్ళు పెంపుడు కుక్క విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. కుక్కను కొడుతూ వారు వికృతానందం అనుభవించారు. అయితే వారు కుక్కను కొట్టగానే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కుక్కలు(Dogs) చాలా విశ్వాసమైనవి. వాటిని కొట్టడం, హింసించడం చేస్తే యజమానులను అయితే ఏమీ అనవు కానీ ఇతరుల మీద చెప్పలేనంత కోపం తెచ్చుకుంటాయి. పెంపుడు కుక్కే కదా ఏం చేస్తుందిలే అని ఇద్దరు కుర్రాళ్ళు(Two young mans) కుక్కను హింసించారు. అయితే ఆ కుక్క వెంటనే వారికి మంచి గుణపాఠం చెప్పింది. వీడియోలో ఇద్దరు కుర్రాళ్ళు వీధిలో నిలబడి ఉండటం గమమనించొచ్చు. ఒక కుర్రాడు కుర్రాడు పట్టుకుని ఉన్నాడు. మరొక కుర్రాడు కుక్కకు ఎదురుగా నిలబడుకుని చేతిలో బెత్తం(stick) పట్టుకుని ఉన్నాడు. బెత్తం పట్టుకుని ఉన్న కుర్రాడు తన బలం కొద్ది బెత్తంతో కుక్క నోటి మీద(young man beaten on dogs mouth) కొట్టాడు. పెంపుడు కుక్క అయినా నోటి మీద కొట్టేసరికి దానికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే తనను కొట్టిన కుర్రాడిమీదకు సింహంలా ఉరికింది. అతడిని పట్టుకుని కొరుకుతుండగా రెండవ కుర్రాడు పరిగెత్తి దాన్ని కంట్రోల్ చెయ్యాలని చూశాడు. అయితే ఆ కుక్క ఈ సారి రెండవ కుర్రాడిమీద దాడి(dog attack) చేసింది. కుక్క నుండి రెండవ కుర్రాడిని తప్పించడానికి మొదటి కుర్రాడు ప్రయత్నం చేశాడు. వారిద్దరూ ఒకరిని మరొకరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. వీధిలో వెళుతున్న ఓ వ్యక్తి కుర్రాళ్ళు కుక్కను హింసించడానికి ప్రయత్నిస్తున్నారని వీడియో తీయడం మొదలు పెట్టగా ఇంత సంఘటన జరిగింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Marriage: ఈ వివాహం నాకిష్టం లేదంటూ స్నేహితురాలితో ఏడుస్తూ చెప్పిన వధువు.. ఒక్క ఫోన్‌తో పెళ్లి రోజు ఊహించని ట్విస్ట్..!


ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. 'వెల్ డన్'(Well done) అనే క్యాప్షన్ ను దీనికి మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్క చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. 'దీన్నే కమ్ బుల్ కిల్ మీ' అని అంటారు అని పంచ్ వేశారు. 'ఇలాంటి కుర్రాళ్ళకు ఇలాగే అవ్వాలి, ఆ కుక్క మంచిపని చేసింది' అని అంటున్నారు. 'ఊరికే ఉన్న కుక్కను గెలికి ప్రమాదం తెచ్చుకన్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'కుక్కలో ఇంత ఆవేశం ఎప్పుడూ చూళ్ళేదు, పెంచుతున్నవాళ్ళమీదే దాడికి దిగిందంటే అది ఎంత నొప్పి అనుభవించిందో' అంటున్నారు.

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులు చేసిన నిర్వాకంతో వరుడికి కొత్త తలనొప్పి.. పెళ్లయిన మర్నాడే జరిగింది తెలిసి..!


Updated Date - 2023-05-23T20:08:06+05:30 IST