Viral Video: రెండు భారీ ఏనుగులు యుద్దానికి దిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది.. సినిమాల్లో కూడా ఇలా చూపించి ఉండరు..

ABN , First Publish Date - 2023-03-24T16:29:55+05:30 IST

సినిమాల్లో కూడా ఏనుగులు ఇలా యుద్దం చెయడం చూసి ఉండరు.. రెండు ఏనుగుల ధాటికి చుట్టుప్రక్కల..

 Viral Video: రెండు భారీ ఏనుగులు యుద్దానికి దిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది.. సినిమాల్లో కూడా ఇలా చూపించి ఉండరు..

మనం సాధారణంగా కుక్కలు పిల్లులు ఫైట్ చేయడం చూసి ఉంటాం. అడపాదడపా పులులు, సింహాలు ఫైట్ చేయడం సోషల్ మీడియాలో చూసి ఉంటాం. కానీ ఏనుగులు ఫైట్(Elephants Fight) చేయడం మాత్రం చూసి ఉండం, సినిమాల్లో కూడా రెండు ఏనుగుల యుద్దాన్ని ఇలా చూపించి ఉండరు. రెండు భారీ ఏనుగుల యుద్దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

జంతువులన్నింటిలో భారీ శరీరం కలిగినవి ఏనుగులే.. ఏనుగుకు కోపం వస్తే సింహం కూడా పిల్లిలా సైడ్ వెళ్ళిపోతుంది. తెలివిలోనూ, ప్రవర్తనలోనూ ఏనుగు చాలా మంచి జంతువు. రెండు భారీ ఏనుగులు యుద్దంచేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దక్షిణాఫ్రికాలో(South Africa) ఉన్న క్రూగర్ నేషనల్ పార్క్(Kruger National Park) లో రెండు ఏనుగుల మధ్య భీకరమైన పోరు జరిగింది. క్రూగర్ నేషనర్ పార్క్ లో సఫారీకి వెళ్ళిన ఒక వ్యక్తికి రెండు ఏనుగులు కనిపించాయి. అతను తన సఫారీ స్లో చేసి వాటిని వీడియో తీయాలని ప్రయత్నించాడు. అయితే ఏనుగులు ఉన్నట్టుండి పోరుకు దిగాయి. భారీగా ఉన్న ఆ ఏనుగులు ఒకదాన్నొకటి తోసుకుంటూ ఓ చెట్టు దగ్గరగా వెళ్ళాయి. అక్కడ ఓ ఏనుగు మరొక ఏనుగును బలం కొద్దీ తొయ్యగానే అది పక్కనే ఉన్న చెట్టుమీద పడింది. ఏనుగు దెబ్బకు చెట్టు రెండుగా చీలి ఒక భాగం నేలకు ఒరిగిపోయింది. చెట్టుమీద పడిన ఏనుగు పరాభవం జరిగిందని ఫీలైందో.. లేక ఫైటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే తరువాత నా సంగతేమవుతుందో అని భయపడిందో తెలియదు. కానీ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వకుండా అక్కడి నుండి తప్పుకుని వెళ్ళిపోయింది.

Read also: Snake: గుమ్మం ముందే కాపుగాచిన పాము.. రాత్రంతా నిద్రలేకుండా గడిపిన కుటుంబ సభ్యులు.. ఓ బల్ల మీదకు ఎక్కి మరీ..


కొండలేమో అన్నట్టుగా ఉండే రెండు ఏనుగుల పోరును సఫారీ రైడర్ వీడియో రికార్డ్ చేశాడు. ఏనుగులు గొడవ ఆపి వాటి దారిన అవి వెళుతుంటే.. ఇప్పుడు అవి కోపంలో ఉన్నట్టున్నాయి, ఏనుగుకు వాటిలో దేనికి నేను దొరికినా నన్ను చీమను నలిపినట్టు కాలికింద నలిపేస్తాయి' అనుకుని వీడియో తీయడం ఆపి వెనక్కు జంప్ అయ్యాడు. SANParks అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఏనుగుల మధ్య ఇలాంటి యుద్దం ఎప్పుడూ చూడలేదు' అని కామెంట్ చేస్తున్నారు. 'సఫారీ రైడర్ వీడియో తీయడం ఆపి వెళ్ళిపోయి మంచి పని చేశాడు' అని కొందరు అన్నారు. ఆ చెట్టు ఈ ఏనుగుల దెబ్బకు అగ్గిపుల్లలా విరిగిపోయింది' అని మరొకరు చమత్కరించారు.

Read also: Skin Health: రోజూ ఇవి కొద్దిగా తింటే చాలు.. ముసలివాళ్ళు కూడా యవ్వనంగా మారతారు..


Updated Date - 2023-03-24T16:29:55+05:30 IST