Viral Video: వీటికి సమ్మర్ హాలిడేస్ ముందే వచ్చేసినట్టున్నాయ్.. పిల్లల్ని మించిన వీటి ఆట చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-04-28T21:11:45+05:30 IST

కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం ఊహించలేం.. ఇదికూడా అంతే.. కానీ వీటి ఆట చూస్తే మాత్రం..

Viral Video:  వీటికి సమ్మర్ హాలిడేస్ ముందే వచ్చేసినట్టున్నాయ్.. పిల్లల్ని మించిన వీటి ఆట చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వేసవి సెలవులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. పుస్తకాలను పక్కన పెట్టి హాయిగా ఆడుకోవచ్చని వారి ఆశ. అమ్మమ్మలు, తాతయ్యల ఊర్లకు వెళ్లి తూనీగల్లా తిరిగేవారు ఉంటారు. అయితే ఈ ఏడాది పిల్లలకంటే ముందే కుక్కపిల్లకు, తాబేలుకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసినట్టున్నాయ్, అందుకే ఎంచక్కా ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయ్(puppy, turtle played foot ball match). ఫుట్ బాల్ మ్యాచ్ ఏంటి? కుక్కపిల్ల, తాబేలు ఆడుకోవడం ఏంటి అనే డౌట్ వస్తుందా? అయితే వీటి ఆటను చూడాల్సిందే.. ఈ ఆట గురించి తెలుసుకోవాల్సిందే..

సోషల్ మీడియాలో(social media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోస్ ఎక్కవగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కుక్కపిల్ల(puppy), తాబేలు(turtle) కలిసి ఫుట్ బాల్(foot ball) ఆడుకుంటున్నాయి. మొదట తాబేలు బాల్ ను తన తలతో కొడుతూ ఆడుకుంటోంది. అప్పుడే జోరుగా పరుగులు తీసే కుక్కపిల్ల తాబేలు నుండి బాల్ ను తీసుకుని అది సరదాగా ఆడుకుంటుంది. అయితే ఆ తరువాత తాబేలు చకచకా కదిలి కుక్కపిల్ల నుండి బాల్ ను తీసుకుని మళ్లీ అది ఆడుకుంటుంది. ఇలా ఒకదాన్నుండి ఒకటి బాల్ ను తీసుకుంటూ ఈ చిన్ని ప్రాణులు ఫుట్ బాల్ ఆడుతోంటే వాటి యజమాని మరింత ఉత్సాహంగా వీడియో తీశారు. రోజువారీ డిస్టర్బ్ లో ఉన్నవారికి ఈ వీడియో గొప్ప ఉపశమనాన్ని అందిస్తోంది.

uterine fibroids: 30ఏళ్ళ తర్వాత మహిళలకు పెద్ద గండం.. ముందే తెలుసుకోకపోతే చాలా కష్టం..


ఈ వీడియోను Gabriele Corno అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ లో షేర్ చేశారు. 'కుక్కపిల్ల, తాబేలు కలసి ఫుట్ బాల్ ఆడుకుంటున్నాయి చూడండి' అనే క్యాప్షన్ ను జతచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీటి ఆటకు ఫిదా అవుతున్నారు. 'ఎప్పుడూ ఈ జంతువుల కాంబినేషన్లో ఆటను చూడలేదు, ఎంత బాగా ఆడుకుంటున్నాయో' అని కొందరు కామెంట్స్ చేసారు. 'ఈ వీడియో నారోజును అందంగా మార్చింది, వాటి ఆటను చూడటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు.. గాల్లో ఎగురుదామని కొండమీద నుండి దూకాడు.. కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


Updated Date - 2023-04-28T21:11:45+05:30 IST