Viral Video: ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2023-08-31T12:57:22+05:30 IST

ఓ కొడుకు తన తల్లి పుట్టినరోజుకు ఇచ్చిన బహుమానం ఆమెను కంటతడి పెట్టించింది.

Viral Video:  ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..

నవమాసాలు మోసి బిడ్డను కన్నతరువాత తమ పిల్లలకు తాహతుకు తగ్గట్టు ప్రతి యేడు పుట్టినరోజు చేస్తారు తల్లిదండ్రులు. పిల్లలు సంతోషపడుతుంటే తాము మురిసిపోతారు. పుట్టినరోజు బహుమతులుగా అడిగిందల్లా తీసిస్తారు. కానీ తల్లిదండ్రుల పుట్టినరోజు తెలుసుకుని వారి పుట్టినరోజు జరిపే పిల్లలు తక్కువేనని చెప్పవచ్చు. చేతికి అందివచ్చిన పిల్లలు బహుమతులు ఇస్తే ఆ తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం. ఓ కొడుకు తన తల్లి పుట్టినరోజుకు ఆమె చిన్ననాటి నుండి ఎంతో ఇష్టం పెంచుకున్న వస్తువును బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన తల్లి రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు చూసిన నెటిజన్ల మనసులు బరువెక్కుతున్నాయి. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ప్రతి ఒక్కరికి చిన్నతనంలో కొన్ని వస్తువుల మీద ఇష్టం ఉంటుంది. కానీ పరిస్థితుల వల్ల అవి సొంతం కావు. కాలంతో పాటు వాటిని మెల్లిగా మరచిపోతారు. ఇక పెళ్లి, పిల్లలు, వారి పెంపకంలో పూర్తీగా పెద్దరికంలో మునిగిపోతారు. కానీ ప్రతి ఒక్కరిలో చిన్నపిల్ల మనస్తత్వం అంటూ ఒకటుంటుంది. చిన్నతనం గుర్తొచ్చినప్పుడో, జ్ఞాపకాలు వెంటాడినప్పుడో అది గుర్తొస్తుంది. ఓ కొడుకు తన తల్లిలో చిన్నపిల్ల(inner child) మనస్తత్వం బయటకు రావడానికి కారణమయ్యాడు. వీడియోలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చిన్న చిన్న బాక్స్ లు ఓపెన్ చేస్తూ ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె ప్రతి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న బొమ్మలు చూస్తూ చాలా భావోద్వేగానికి లోనవుతుంది. ఆమె కళ్ళలో ఎమోషన్ తాలూకు కంటి తడి స్పష్టంగా కనిపిస్తుంది . అవి ఆమె చిన్నతనంలో ఆశ పడిన బొమ్మలట. వాటిని ఆమె కొనుక్కోలేకపోయింది. అయితే మాటల్లో కొడుకుతో తనకు ఇష్టమైన బొమ్మల గురించి ఒకటి రెండు సార్లు చెప్పింది. అంతే.. కుర్రాడు తన తల్లికోసం వెతికి మరీ ఆ బొమ్మలు కొన్నాడు. వాటిని చక్కగా ప్యాక్ చేసి తన తల్లికి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చాడు(son gifted dolls to mother). కొడుకు నుండి బహుమతి అందుకున్న తరువాత ఆమె బొమ్మలను వరుసగా పేర్చుతూ వాటిని పదే పదే ముట్టుకోవడం చూస్తే అందరికీ కళ్లు చెమర్చుతాయి.

Viral Video: ఈ ఆటోడ్రైవర్ మామూలోడు కాదు.. అందరూ ప్రయోణించే ఆటోను ఇతనెలా మార్చేశాడో చూస్తే!!ఈ వీడియోను goodnews_movement అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో షేర్ చేశారు. 'చిన్నతనంలో ఆ బొమ్మలు కొనాలని ఆమె ఆశపడింది. పెద్దయ్యాక కొడుకు ఆమె కోరిక తీర్చాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషన్ అవుతున్నారు. 'ప్రతి మనిషిలో చిన్నపిల్ల మనస్తత్వం దాగుంటుంది. అదే ఇది'అని ఒకరు కామెంట్ చేశారు. 'పెద్దరికం చిన్ననాటి సంతోషాలకు ఎప్పుడూ అడ్డు కాదు' అని మరొకరు అన్నారు. 'నా వయసు 42, నాకు బార్బీ బొమ్మలంటే ఇష్టం ఉండేది. నా కూతురు వల్ల ఆ కోరిక తీరింది' అని మరొక మహిళ తన అనుభవం పంచుకున్నారు. 'ఆమె కొడుకు ఎంత మంచివాడో. తన తల్లి కోరికను తీర్చడం నిజంగా చాలా గొప్ప విషయం' అని ఇంకొందరు ఆమె కొడుకును మెచ్చుకుంటున్నారు.

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?


Updated Date - 2023-08-31T12:57:22+05:30 IST