Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?

ABN , First Publish Date - 2023-08-30T12:36:23+05:30 IST

చేతిలో పైసా లేని సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలంటే కష్ఠమే. అయితే ఒక క్రెడిట్ కార్డు బిల్లును మరొక క్రెడిట్ కార్డుతో కట్టడం సాధ్యమేనా? ఇలా కట్టడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదా?

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?

కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీచేస్తాయి. ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గరా క్రెడిట్ కార్డ్ తప్పనిసరిగా ఉంటున్నాయి. కొందరు ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుంటారు. షాపింగ్ దగ్గర నుండి వివిధ రకాల చెల్లింపుల వరకు క్రెడిట్ కార్జ్ ఉపయోగించే వారు ఎక్కువ. అయితే ఈ క్రెడిట్ కార్డ్ కు నెలనెలా నిర్ణీత తేదీన EMI చెల్లింటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నెలవారి సంపాదన పూర్తీగా ఖర్చైపోయి క్రెడిట్ కార్డ్ చెల్లింపుకు పైసా మిగలకుండా అయిపోతుంది. క్రెడిట్ కార్డుకు తగిన సమయంలో డబ్బు కట్టకపోతే ఫైన్ తో కట్టాల్సి వస్తుంది. అంతే కాదు ఇలా జరిగితే క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బ తింటుంది. ఇలాంటి పరిస్థితిలో ఒక క్రెడిట్ కార్డు బిల్లును మరొక క్రెడిట్ కార్డుతో కట్టడం సాధ్యమేనా? ఇలా కట్టడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదా? పూర్తీగా తెలుసుకంటే..

క్రెడిట్ కార్డ్ ఆధారంగా చాలా లావాదేవీలు ఆధారపడి ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. అయితే కొన్ని సార్లు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడంలో జాప్యం జరగడం లేదా డబ్బుల్లేకపోవడం జరుగుతుంటుంది. ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ సమస్యను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్(credit card balance transfer) ప్రక్రియ ద్వారా అధిగమించవచ్చు. దీనికోసం బ్యాంక్ కస్టమర్ కేర్(Bank customer care) కు కాల్ చేసి వారి ద్వారా డబ్బు బదిలీ చేయవచ్చు లేదంటే బ్యాంకు వెబ్సైట్ లేదా యాప్(Website or App) నుండి ఎవరికి వారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం. ఇందుకోసం కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదట వెబ్సైన్ లో ఎంత అమౌంట్ బదిలీ చేయాలో, ఏ కార్డుకు బదిలీ చేయాలో ఆ వివరాలు అన్నీ పూరించాలి. ఆ తరువాత లంప్ సమ్ లేదా EMI అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అంతే ఇలా ఒక కార్డు నుండి మరొక కార్డుకు చెల్లింపు చేసేయచ్చు.

Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!



క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ చేయడం వల్ల కలిగే లాభనష్టాలేంటంటే..

క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపుకు చేతిలో డబ్బు లేని సమయంలో ఇతరుల నుండి డబ్బు ఇప్పించుకోవడం అప్పు చేయడం వంటి పనులు తప్పిపోతాయి. సాధారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ ఆలస్యంగా కడితే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాకుండా క్రెడిట్ స్కోర్ కు నష్టం కలుగుతుంది.ఇవన్నీ తప్పించుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ చెల్లింపులలో నిర్లక్ష్యం చేసేవారికి ఆ తరువాత అంత సులువుగా లోన్ లభించదు. ఈ సమస్య కూడా క్రెడిట్ కార్డు బ్యాలెన్ బదిలీ ద్వారా తొలగిపోతుంది. బిల్ చెల్లించడంలో రెండు మూడు సార్లు ఆలస్యం జరిగితే బ్యాంకులు కస్టమర్ ను డిపాల్ట్ కేటగిరీలోకి తోసెస్తారు. ఆ ప్రమాదం కూడా తప్పిపోతుంది. బ్యాలెన్స్ బదిలీలో EMI ఆప్షన్ ఎంచుకుంటే దీన్ని మళ్లీ తిరిగి చెల్లించేయచ్చు.

ఇక ఇలా ఒక క్రెడిట్ కార్డు బిల్ ను మరొక క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ ద్వారా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ పద్దతి మంచిదే అయినప్పటికీ ఈ ప్రాసెస్ ను మళ్లీ మళ్ళీ ఉపయోగిం వల్ల రెండవ కార్డ్ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒకదాన్నుంచి మరొకదానికి చెల్లింపు చేస్తూ కార్డు అప్పు పెరిగిపోతే అది తిరిగి చెల్లించేటప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అప్పు పెరిగిపోతుంది.

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!


Updated Date - 2023-08-30T12:36:23+05:30 IST