Viral Video: అయ్యో పాపం.. అంటూ ఈ బుడ్డోడి గురించి తెగ కామెంట్లు.. నెటిజన్లను కట్టి పడేస్తున్న వీడియోలో ఏముందంటే..!

ABN , First Publish Date - 2023-03-29T18:28:24+05:30 IST

పిల్లాడి అల్లరి వినబడటం లేదేంటని కాస్త కంగారు పడిన తల్లి వెతుక్కుంటూ వెళ్ళగా కనిపించిన సీన్ చూసి..

Viral Video: అయ్యో పాపం.. అంటూ ఈ బుడ్డోడి గురించి తెగ కామెంట్లు.. నెటిజన్లను కట్టి పడేస్తున్న వీడియోలో ఏముందంటే..!

ఇంట్లో చిన్న పిల్లలు(Small Kids) ఉన్నారంటే చెప్పలేనంత సందడి ఉంటుంది. వాళ్ళు నవ్వినా, అలిగినా, చిలిపి పనులు చేసినా అన్నీ తల్లిదండ్రులకు మురిపెమే.. ఓ ఇంట్లో మహిళ ఇంటిపనిలో మునిగిపోయింది. ఆమెకు పని మధ్యలో ఉన్నట్టుండి తన కొడుకు గుర్తొచ్చాడు. నడక కూడా సరిగా రాని పిల్లాడి అల్లరి వినబడటం లేదేంటని కాస్త కంగారు పడిందామె.. 'పిల్లాడు ఏం చేస్తున్నాడో ఏమో..' అనుకుంటూ హడావిడిగా కొడుకును వెతకడం మొదలుపెట్టింది. ఆమె ఇల్లంతా తిరుగుతూ ఫ్రిడ్జ్(Fridge) దగ్గర ఆగిపోయింది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తన కొడుకు చేస్తున్నపని చూసి అవాక్కయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఇంట్లో చిన్నపిల్లల అల్లరి వినబడుతుంటే వాళ్లు క్షేమంగా ఉన్నట్టు. వారు అల్లరి చేయలేదంటే ఏదో గూడుపుఠాని చేస్తున్నారని లెక్క. లేదంటే ఏదైనా ప్రమాదం నెత్తిమీదకు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థం. ఓ ఇంట్లో పనిలో మునిగిపోయిన మహిళ తన కొడుకు అల్లరి వినిపించకపోవడంతో కంగారు పడింది. పిల్లాడిని వెతుక్కుంటూ వెళ్ళగా తన బుల్లి కొడుకు ఫ్రిడ్జ్ దగ్గర కనిపించాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిజ్ లో ఉంచిన అన్నం పాత్ర(Rice bowl)ను చేతుల్లోకి తీసుకుని నేరుగా పాత్రలో తల పెట్టి అన్నం తింటున్నాడు(Kid eating food in bowl). అలా అన్నం తింటుంటే పిల్లాడి ఇంట్లోవాళ్ళు వీడియో తీశారు. baby.lover.20 అనే ఇన్స్ట్రాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి ఈ వీడియో షేర్ చేయబడింది. అన్నం తింటున్నప్పుడు పిల్లాడి క్యూట్ నెస్ ఓవర్ లోడ్(cuteness over load) అయ్యింది. ఆ బాబు ముఖం అన్నం తింటున్న విధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ముద్దుగా ఉన్నాడో అన్నం దొంగ అని పిల్లాడి మీద ప్రేమను కురిపిస్తున్నారు నెటిజన్లు.

Read also: Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..


వెన్న దొంగిలించిన చిన్ని కృష్ణుడిలా(Little Krishna) ఈ బుడ్డోడు అన్నం దొంగిలించాడని కొందరు కామెంట్స్ చేశారు. 'అయ్యో పాపం పిల్లాడికి ఎంత ఆకలేసిందో ఏమో.. అన్నం కోసం తనే రంగంలోకి దిగాడు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బుల్లి దొంగ మీద నెటిజన్లు పిచ్చి ప్రేమ కురిపిస్తున్నారు.

Read also: Viral Video: ఈ జింక తెలివి చూస్తే షాకవుతారు.. ప్రాణాలు పోవడం ఖాయమనుకున్న సమయంలో ఎలా తప్పించుకుందో చూడండి


Updated Date - 2023-03-29T18:32:55+05:30 IST