Viral Video: నెటిజన్ల కళ్ళన్నీ ఈ వృద్ద జంటమీదనే.. ఒకపక్కన వర్షం కురుస్తోంటే గొడుగేసుకుని మరీ రహదారి పక్కన వీళ్లేం చేస్తున్నారో చూస్తే..

ABN , First Publish Date - 2023-08-06T14:37:49+05:30 IST

వృద్దులకు సంబంధించిన కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఈ వృద్ద దంపతులు వర్షం కురుస్తున్నా ఏమాత్రం తగ్గలేదు..

Viral Video: నెటిజన్ల కళ్ళన్నీ ఈ వృద్ద జంటమీదనే.. ఒకపక్కన వర్షం కురుస్తోంటే గొడుగేసుకుని మరీ రహదారి పక్కన వీళ్లేం చేస్తున్నారో చూస్తే..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఎక్కువభాగం యూత్ కు సంబంధించినవే అయ్యుంటాయి. కానీ కొన్ని సార్లు వృద్దులకు సంబంధించిన వీడియోలు కూడా తళుక్కున మెరుస్తుంటాయి. ఈ వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వృద్ద జంట వర్షం కురుస్తున్న వేళ గొడుగేసుకుని మరీ రహదారి ప్రక్కన చేస్తున్న పని చూస్తే జీవితాన్ని ఆస్వాదించడమంటే ఇదే కదా అని అనిపించకమానదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఓ 60,70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ద జంటలను(old couples) చూస్తే జీవితం విలువ బాగా అర్థమవుతుంది. పెళ్లి చేసుకుని, పిల్లలను కని, వాళ్లను ప్రయోజకులను చేసి తదుపరి తమ జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతున్నారంటే ఆ భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే గుణం చాలా ఉందని చెప్పవచ్చు. ఈ వృద్ద జంట కూడా అచ్చం అదే కోవకు చెందినదే అనిపిస్తుంది. వర్షం కురుస్తున్న సాంయంత్రం ఓ వృద్ద జంట సరదాగా బయటకు వచ్చినట్టుంది. వారిద్దరూ చల్లని వర్షానికి తమనోటిని రుచి చేసుకోవడానికి పానీపూరీ బండి దగ్గరకు చేరుకున్నారు. వీడియోలో ఒకవైపు వర్షం కురుస్తోంటే, మరొకవైపు గొడుగేసుకునిమరీ పానీపూరీ బండి దగ్గర నిలబడుకున్నారు(old couple enjoy pani puri in rain). బామ్మ నిండుగా చీర కట్టుకుని, తాతగారు చొక్కా ప్యాంటులో హుందాగా ఉన్నారు. పాపం తాతగారికి పళ్లు లేకపోయినా బోసి నోటితో మెల్లగా పానీపూరీ నములుతున్నాడు. ఆ తరువాత పానీపూరీ బండాయన్ను అడిగి మరీ పానీ వేయించుకుని తాగడం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆ పానీపూరీ అమ్ముతున్న వ్యక్తి కూడా వృద్దుడే. ఇలా ఒకే ఫ్రేమ్ లో వృద్దులను చూస్తే వారు తమ జీవితాలను ఎంత సంతోషంగా గడుపుతున్నారో అనిపిస్తుంది.

Viral Video: గుండె దడదడలాడించే వీడియో.. రహదారి ప్రక్కన నిద్రపోతున్న మహిళ మీద దూసుకుపోయిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే ..



ఈ వీడియోను kajol11_ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేసారు. 'వీళ్ళను చూస్తే ప్రేమ వయసుకు సంబంధించినది కాదనే విషయం అర్థమవుతుంది' అని క్యాప్షన్ మెన్షన్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్ద జంటను చూసి ఫిదా అవుతున్నారు.'జీవితంలో అత్యుత్తమ క్షణాలు ఇవే.. వారిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యకంగా ఉండాలి' అని ఒకరు కామెంట్ చేశారు. 'వారిద్దరూ మా అమ్మానాన్నలు. నాకిది ఎంతో విలువైనది. ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు ఎంతో థాంక్స్' అని వారి కుమార్తె కూడా ఈ వీడియోకు స్పందించింది. చాలామంది ఈ వీడియోను తమ భాగస్వాములకు షేర్ చేస్తున్నారు, మరికొందరు తమ భాగస్వాములను ట్యాగ్ చేస్తున్నారు.

Viral Video: జింక ఏం చేస్తుందిలే అనుకున్న నక్కకు ఊహించని షాక్.. ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో మీరే చూడండి..


Updated Date - 2023-08-06T14:37:49+05:30 IST