Viral Video: గుండె దడదడలాడించే వీడియో.. రహదారి ప్రక్కన నిద్రపోతున్న మహిళ మీద దూసుకుపోయిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే ..

ABN , First Publish Date - 2023-08-06T13:17:11+05:30 IST

పాపం రహదారికి ఒకవైపు ఓ మహిళ నిద్రపోతోంటే ఒక్కసారిగా ఓ కారు దూసుకొచ్చి ఆమె మీదుగా వెళ్ళింది. ఆ తరువాత జరిగిన సంఘటన చాలా షాకింగ్ గా ఉంది

Viral Video: గుండె దడదడలాడించే వీడియో..  రహదారి ప్రక్కన నిద్రపోతున్న మహిళ మీద దూసుకుపోయిన కారు.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే ..

రహదారుల మీద ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొన్ని అనుకోకుండా జరిగితే.. మరికొన్ని వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఫుట్ పాత్ ల మీద కూర్చున్నవారిమీదా, పడుకున్నవారిమీదా వాహనాలతో తమ ప్రతాపం చూపించేవారు ఉంటారు. కొందరు బాగా తాగి ఇలాంటివారిని తమ వాహనాలకు బలితీసుకుంటూ ఉంటారు. పాపం రహదారికి ఒకవైపు ఓ మహిళ నిద్రపోతోంటే ఒక్కసారిగా ఓ కారు దూసుకొచ్చి ఆమె మీదుగా వెళ్ళింది. ఆ తరువాత జరిగిన సంఘటన చాలా షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు షాక్ కు లోనవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చావు(death) ఎటువైపునుండి వచ్చి ప్రాణాలు లాక్కుపోతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కశాతం అదృష్టం ఉన్నా చావు నుండి బయటపడవచ్చు. వీడియోలో ఓ మహిళ, ఇంకొక వ్యక్తి ఇద్దరూ కలసి రహదారికి ఒకవైపు ఒక ప్లాస్టిక్ కవర్ పరచుకుని దానిమీద నిద్రపోతున్నారు(women sleeping on road side). అది అండర్ గ్రౌండ్ ప్రాంతం కావడంతో అలసిపోయినవారు చాలా గాఢంగా నిద్రపోయారు. అప్పుడే అటువైపు ఒకకారు వచ్చింది . అది మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఆ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి రహదారి మీద పడుకున్న వారిని గమనించుకోలేదు. దీంతో అతను కారును నిద్రిస్తున్న మహిళ మీద పోనిచ్చాడు(car drive on the women) . పైపెచ్చు ఆ మహిళ వెల్లికిలా పడుకుని ఉండటంతో ఆ కారు సరిగ్గా మహిళ మెడ కింద, ఛాతీ మీదుగా వెళ్ళింది. వేరే ఎవరైనా అయితే ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయేవారేమో. కానీ కారు ముందరి టైరు తనమీద పోగానే ఆ మహిళ లేచి కూర్చుంది. తన మెడను, ఛాతీని పట్టుకుని ఆమె ఏడుస్తుంది. ఊహించని ఈ పరిణామానికి సదరు కారు యజమాని కూడా భయపడినట్టు, బాధపడినట్టున్నాడు. అతను అక్కడినుండి ఉడాయించకుండా వెంటనే కారులోంచి దిగి సదరు మహిళ దగ్గరకు వెళ్లాడు. నొప్పితో విలవిలలాడుతున్న మహిళను పరామర్శిస్తూ ఆమెను కౌగిలించుకుని ఆమెను ఓదార్చాడు. ఆ మహిళ ప్రక్కన పడుకున్న వ్యక్తి లేచి ఏమి జరుగుతోందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ సంఘటన మొత్తం సిసికెమెరాలో రికార్డ్ కావడంతో బయటకువచ్చింది.

Viral Video: జింక ఏం చేస్తుందిలే అనుకున్న నక్కకు ఊహించని షాక్.. ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో మీరే చూడండి..



ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'అసలామె ఎలా బ్రతికింది?' అని ఒకరు కామెంట్ చేసారు. 'ఇది నిజంగా అద్భుతం. ఆ మహిళ చావుకు టికెట్ తీసుకుని మళ్లీ వెనక్కు వచ్చినట్టుంది' అని అంటున్నారు. 'ఆమె క్షేమగానే ఉందా? ఆ తరువాత ఆమెకు ఏమీ కాలేదుగా ?' అని ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pressure Cooker: ప్రెజర్‌ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!


Updated Date - 2023-08-06T13:22:33+05:30 IST