Viral Video: ఇవేం పనులయ్యా బాబూ..? టేబుల్ ఫ్యానుకు పాలిథిన్ కవర్‌ను కట్టి.. అందులో పడుకోవడం బాగానే ఉంది కానీ..!

ABN , First Publish Date - 2023-05-31T20:22:01+05:30 IST

అందుబాటులో ఉన్నవాటితోనే చల్లదనాన్ని అనుభవించడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. టేబుల్ ఫ్యాన్ తో కూలర్ చేసినవారు, మట్టి కుండలతో అతిచల్లగాలి క్రియేట్ చేసిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి

Viral Video: ఇవేం పనులయ్యా బాబూ..? టేబుల్ ఫ్యానుకు పాలిథిన్ కవర్‌ను కట్టి.. అందులో పడుకోవడం బాగానే ఉంది కానీ..!

ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఏసీలు, కూలర్లు లేనివారు తమతో ఉన్న టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తువులతో చల్లదనాన్ని పొందాలని చూస్తున్నారు. ఓ వ్యక్తి ఇలాగే కొత్త ప్రయోగం చేశాడు. ఎండ వేడిమి తట్టుకోలేక అతను టేబుల్ ఫ్యానుకు పాలిథిన్ కవర్ కట్టి అందులో దూరి పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ప్రయోగం చూసి షాకవుతున్నారు. 'అంతా బానే ఉంది కానీ..' అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి . ఈ ఎండల ధాటికి ఏసీలు(AC), కూలర్లు(Cooler) వాడుతున్నవారు కూడా అల్లాడిపోతున్నారు. ఇక అవి లేని వారి బాధ దేవుడికే ఎరుక. అయితే అందుబాటులో ఉన్నవాటితోనే చల్లదనాన్ని అనుభవించడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. టేబుల్ ఫ్యాన్ తో కూలర్ చేసినవారు(Table Fan Cooler), మట్టి కుండలతో అతిచల్లగాలి(Clay pot cooler) క్రియేట్ చేసిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి తన తెలివితో మరొక కొత్త ప్రయోగం చేశాడు. ఓ వ్యక్తి తన దగ్గరున్న టేబుల్ ఫ్యాన్(Table Fan) కు పెద్ద ఫాలిథిన్ కవర్(Polythene cover) కట్టాడు. ఆ కవర్ లో అతను దూరి పడుకున్నాడు(Man sleep in polythene cover). ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ ఫాలిథిన్ కవర్ కాస్తా సొరంగంలా(tunnel) మారిపోయింది. ఫ్యాన్ గాలి అటూ ఇటూ వెళ్ళకుండా ఆ కవర్ లో ఉన్న అతనికి మాత్రమే వస్తోంది. అతను ఎంచక్కా మంచం మీద పడుకుని ఈ సెట్టింగ్ చేసుకున్నాడు.

WhatsApp: ఫ్యామిలీ వాట్సప్ గ్రూపులో అలాంటి ఫొటో పెట్టావేంటి..? వెంటనే డిలీట్ చెయ్.. అంటూ అక్క మెసేజ్.. తమ్ముడు చేసిన మిస్టేక్‌తో..


ఈ వీడియోను twchnical_personnel అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి తెలివి చూసి అవాక్కవుతున్నారు. 'మనుషుల్లో క్రియేటీవిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి' అని అంటున్నారు. 'అతను కవర్ లో దూరి పడుకున్నాడు సరే.. కానీ ఆ ఫ్యాన్ గాలి అక్కడక్కడే రిపీట్ అయితే వేడి చేస్తుంది తప్ప చల్లదనం ఇవ్వదు' అని మరికొందరు అంటున్నారు.

Viral Video: టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడో వృద్ధుడు.. ఓ కుర్రాడు తన వైపే రావడం చూసి కంగారు.. ట్యాబ్‌లో అతడు చూపించిన ఫొటోను చూసి..!


Updated Date - 2023-05-31T20:29:07+05:30 IST