Viral Video: మెట్రో రైల్లో మరో రచ్చ.. భయంతో వణికిపోయిన ప్రయాణీకులు.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక..!

ABN , First Publish Date - 2023-05-25T20:29:42+05:30 IST

ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా మెట్రో రైళ్ళలో కుర్రకారు చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. అయితే వాటన్నింటికి విభిన్నంగా మెట్రో ప్రయాణీకులను వణికించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మెట్రో ప్రయాణికులు భయప్డడారు. దీనికి సంబంధించిన వీడియో..

Viral Video: మెట్రో రైల్లో మరో రచ్చ.. భయంతో వణికిపోయిన ప్రయాణీకులు.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక..!

మెట్రో రైల్లో ఏం జరిగినా అది చాలా తొందరగా వైరల్ అవుతంది. ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా మెట్రో రైళ్ళలో కుర్రకారు చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. అయితే వాటన్నింటికి విభిన్నంగా మెట్రో ప్రయాణీకులను వణికించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మెట్రో ప్రయాణికులు భయప్డడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలింతకూ వారి భయానికి కారణం ఏంటి? మెట్రో రైల్లో ఏం జరిగింది పూర్తీగా తెలుసుకుంటే..

ఈ మధ్య కాలంలో మెట్రో రైల్లో(Metro train) యువతీయువకుల నిర్వాకాలు మామూలుగా లేవు. వీటికి భిన్నంగా మెట్రో ప్రయాణీకులకు వణుకుపుట్టించిందొక వానరం(Monkey). ఎలా వచ్చిందో ఏమో కానీ ఢిల్లీ మెట్రో ట్రైన్ లోకి ఓ వానరం ప్రవేశించింది(Monkey enter in Delhi metro). మెట్రో తలుపులు ఆటోమెటిక్ గా మూసుకుని పోవడం మూలానా అది బయటకు వెళ్లలేకపోయింది. దీంతో మెట్రో ట్రైన్ లోనే బ్లాక్(Monkey blocked in metro) అయిపోయింది. అది బయటకు వెళ్ళడానికన్నట్టు దారికోసం మెట్రో అంతా తిరుగుతోంది. దానికి కోపం, ఆవేశం వస్తే తమను ఏమి చేస్తుందోనని మెట్రో ప్రయాణీకులు క్షణక్షణ గండంగా కాలం గడిపారు. పాపం ఆ కోతి కిటికీ దగ్గరా ప్రయాణీకుల పక్కనా కూర్చుని 'ఈ మనుషుల మధ్యకు ఎందుకొచ్చి పడ్డానురా దేవుడా..' అన్నట్టుగా ఫీలైంది. మెట్రో మొత్తం ఈ కోతి హల్చల్ చేసింది. ఇది పాత వీడియోనని తెలిసినా ప్రస్తుతం మెట్రో అంటేనే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితులలో మళ్ళీ ఈ వీడియో తెరపైకి వచ్చింది.

Rs 2000 Note: మీ దగ్గర రూ.2 వేల నోటు ఉందా..? అస్సలు వదులుకోలేని సూపర్ ఛాన్స్.. అదనంగా ఎంత లాభమంటే..!


ఈ వీడియోను anuragminusverma అనే ఇన్స్టాగ్రామ్ యూజర్(Instagram) షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ సెటైర్లు పేల్చుతున్నారు. 'మనుషుల తరువాత ఇప్పుడు కోతులు మెట్రో ప్రయాణం చేయడానికి సిద్దమయ్యాయి' అని కామెంట్ చేస్తున్నారు. 'ఢిల్లీ మెట్రో రైలు తిరుగుబాటుకు మంచి స్థలంగా మారింది. అందుకే కోతులు కూడా ఇదే స్థలాన్ని ఎన్నుకున్నట్టున్నాయి' అని అంటున్నారు. 'ఢిల్లీ మెట్రోలో మరొక పేలుడు' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Viral Video: ఈ జింక ఎందుకిలా చేస్తోంది..? ఆ చిన్నారి అసలేం చెప్పింది..? నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న వీడియో ఇది..!


Updated Date - 2023-05-25T20:29:42+05:30 IST