Rs 2000 Note: మీ దగ్గర రూ.2 వేల నోటు ఉందా..? అస్సలు వదులుకోలేని సూపర్ ఛాన్స్.. అదనంగా ఎంత లాభమంటే..!

ABN , First Publish Date - 2023-05-25T18:17:29+05:30 IST

సాధారణంగా సమ్మర్ సేల్ అని, వింటర్ సేల్ అని ఫెస్టివల్ సేల్ అని కస్టమర్లను తమవైపు ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన 2000రూపాయల నోటుతో షాపింగ్ చేసే వారికి..

Rs 2000 Note: మీ దగ్గర రూ.2 వేల నోటు ఉందా..? అస్సలు వదులుకోలేని సూపర్ ఛాన్స్.. అదనంగా ఎంత లాభమంటే..!

2000రూపాయల నోటు ఉపసంహరణ అనే మాట వినగానే ప్రజలందరూ తమ దగ్గరున్న నోట్లను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచనలో పడ్డారు. ఈ నోట్లను సెప్టెంబర్ వరకు బ్యాంకులలో మార్చుకోవచ్చని ఆర్బీఐ(RBI) తెలిపినా వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. అలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఓ వ్యాపారి తెలివిగా(merchant intelligance) ఆలోచించాడు. 2000రూపాయల నోటుతో షాపింగ్ చేసేవారికి ఎక్స్ట్రా బెనిఫిట్(extra benifit with 2000note shoping) కూడా కల్పించాడు. ఇతను ఇచ్చిన ఆఫర్ చూసి ప్రజలు పెద్ద ఎత్తున అతని షాపుకు క్యూ కట్టారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడీ వ్యాపారి ఇచ్చిన ఆఫర్ గురించే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సమాజంలో పరిస్థితులకు తగ్గట్టు ఆలోచించి కస్టమర్లను ఆకర్షించేవాడే నిజమైన వ్యాపారస్తుడు. సాధారణంగా సమ్మర్ సేల్ అని, వింటర్ సేల్ అని ఫెస్టివల్ సేల్ అని కస్టమర్లను తమవైపు ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన 2000రూపాయల నోటును అడ్డం పెట్టుకుని ఓ వ్యాపారి బిజినెస్ మంత్రం ఉపయోగిస్తున్నాడు. ఢిల్లీ(Delhi)కి చెందిన ఓ మాంసం దుకాణాదారుడు(butcher) 2000రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రకటన తరువాత ఓ కొత్త పద్దతి ఫాలో అవుతున్నాడు. అతను తన షాపు బయట ఓ పోస్టర్(poster) అతికించాడు. ఆ పోస్టర్ మీద '2000రూపాలతో మా దగ్గర షాపింగ్ చేయండి, 2100రూపాయల విలువైన వస్తువులను మీ వెంట తీసుకెళ్ళండి' అని రాసుంది. 2000రూపాయలకు 2100రూపాయల విలువైన మాంసాన్ని ఆ దుకాణాదారుడు ఇస్తాడట. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: పురిటి నొప్పులు వస్తున్నాయని భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. బిడ్డను భర్త చేతిలో పెట్టినట్టే పెట్టి భారీ షాకిచ్చారు..!


ఈ పోస్టర్ ను Sumit Agarwal అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account) నుండి షేర్ చేశారు. 'ఆర్బీఐ తెలివైనదని మీరు అనుకుంటే, ఢిల్లీ వాసులు అంతకంటే తెలివైనవారు కాబట్టి మరొకసారి ఆలోచించండి' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ చూసిన నెటిజన్లు వ్యాపారి టైమింగ్ కు ఆశ్చర్యపోతున్నారు. 'నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ వరకు సమయమున్నా ప్రజలు తొందరపడుతున్నారు. ఇదంతా బిజినెస్ ట్రిక్..' అంటున్నారు. 'ఆ వ్యాపారస్తులకు నోట్లను సులువుగా ఎలా మార్చుకోవాలో తెలుసు, అందుకే ఇలాంటి ప్రకటన ఇచ్చారు' అని కొందరు కామెంట్స్ చేశారు. 'కస్టమర్లకు 2100రూపాయల వస్తువులు వస్తాయేమో.. కానీ వ్యాపారికి 2000రూపాయల అమ్మకం చాలా సులువుగా జరిగిపోతుంది ఎంత తెలివో..' అని మరికొందరు అంటున్నారు.

Wife: వామ్మో.. ఈ భార్య మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదుగా.. భర్త చావుకు కారణమేంటో డాక్టర్లు కూడా తేల్చలేకపోతున్నారు.. అసలు కథేంటంటే..!


Updated Date - 2023-05-25T18:17:29+05:30 IST