Viral Video: తెలివంటే నీదే బ్రదరూ.. చేతి పంపును అస్సలు ముట్టుకోకుండా నీళ్లను ఎలా బయటకు రప్పించాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-04-05T16:56:45+05:30 IST

స్మార్ట్ గా మారిపోతున్న ఈ కాలంలో బోరింగ్ పంపును కూడా స్మార్ట్ గా మార్చేశాడొక వ్యక్తి. ఈ బోరింగ్ పంప్ ను ముట్టకుండా, దాన్ని కొట్టకుండానే నీళ్ళు వచ్చేలా చేసిన అతని ఆవిష్కరణ

Viral Video: తెలివంటే నీదే బ్రదరూ.. చేతి పంపును అస్సలు ముట్టుకోకుండా నీళ్లను ఎలా బయటకు రప్పించాడో మీరే చూడండి..!

తొంబైల కాలంలో పుట్టినవారికి బోరింగ్ పంప్(Boring pump) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేతులు నొప్పి పుట్టేదాగా ఈ చేతి పంపు(Hand pump) కొట్టి బిందెలలో నీళ్ళు నింపుకుని తీసుకెళ్ళేవారు. ఇప్పుడూ అడపాదడపా ఈ బోరింగ్ పంపులు గ్రామాలలో దర్శనం ఇస్తుంటాయి. కానీ వీటిని కొట్టి నీళ్ళు పట్టుకునేంత ఓపిక ఉండటం లేదు ఎవరికీ. స్మార్ట్ గా మారిపోతున్న ఈ కాలంలో బోరింగ్ పంపును కూడా స్మార్ట్ గా మార్చేశాడొక వ్యక్తి. ఈ బోరింగ్ పంప్ ను ముట్టకుండా, దాన్ని కొట్టకుండానే నీళ్ళు వచ్చేలా చేసిన అతని ఆవిష్కరణ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బావుల(Well's) నుండి నీళ్లు మోసుకోచ్చే పనికి బ్రేక్ ఇస్తూ బోరింగ్ పంప్ లు లేదా చేతిపంపులు(Boring pump or hand pump) ప్రజల జీవితాల్లోకి వచ్చాయి. వంతుల వారిగా బోరింగ్ కొట్టి నీళ్ళు పట్టుకున్న సందర్భాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. అయితే అన్నీ స్మార్ట్ అయిపోతున్న ఈ కాలంలో బోరింగ్ కొట్టి నీళ్ళు తీసుకెళ్ళే ఆసక్తి ఎవరికీ ఉండటం లేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి బోరింగ్ పైప్ ను కూడా స్మార్ట్ గా మార్చేశాడు. సైకిల్ చైన్(Bicycle chain), సైకిల్ పెడల్(Bicycle pedal), స్విచ్ బోర్డ్(Switch board), కొన్ని వైర్ల(Some electric wires) సహాయంతో బోరింగ్ పంప్ ను టచ్ చేయకుండా, కొట్టకుండా నీరు వచ్చేలా సెట్ చేశాడు. స్విచ్ బోర్డ్ కు వైర్ కనెక్ట్ చేసి దాన్ని సైకిల్ చైన్, సైకిల్ పెడల్, బోరింగ్ హ్యాండిల్ లకు అటాచ్ చేశాడు. స్విచ్ వేయగానే సైకిల్ పెడల్ కదలడం, చైన్ తిరగడం మొదలవుతుంది. దాంతో మెల్లగా బోరింగ్ హ్యాండిల్ పైకి కిందకూ ఆపరేట్(operate up-down) అవుతుంది. బోరింగ్ ముందు భాగంలో నీళ్ళు సాధారణంగా పంపు కొట్టినప్పుడు ఎలా వస్తాయో అలా వస్తున్నాయి. ఈ బోర్ పంప్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

upendra_n_verma_143 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'కొత్త ఆవిష్కరణలు పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థల్లోనే ఉంటాయనుకుంటారు కానీ అది తప్పు' అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 'ఈ వీడియో మన దేశం నుండి బయటకు వెళ్ళకపోతే మంచిది. మన ప్రతిభను తమదిగా చెప్పుకునే విదేశీలు రెడీ అవుతారు' అని మరికొందరు అన్నారు. 'అతనే కదా నిజమైన సైంటిస్ట్' అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా దేశంలో ప్రతిభకు కొదల లేదని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు.

Read also: Unknown Facts about AC: కొందరికీ ఏసీ ఎందుకు పడదు..? తలనొప్పి, కళ్లు మండటం వంటివి అసలెందుకు వస్తాయి..? చాలా మందికి తెలీని నిజాలివి..!


Updated Date - 2023-04-05T16:56:45+05:30 IST