Viral Video: మా ఇంట్లో జరిగిన ఘోరం.. ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదని ఈ 23 ఏళ్ల యువతి వింత ప్రయత్నం.. రాత్రిళ్లు రోడ్లపై నిల్చుని..

ABN , First Publish Date - 2023-03-23T17:54:07+05:30 IST

ఒకేఒక్క రాత్రిలో ఆమె జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన ఆమె ఆలోచన మార్చేసింది. ఎవరికీ అలా జరగకూడదని..

Viral Video: మా ఇంట్లో జరిగిన ఘోరం.. ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదని ఈ 23 ఏళ్ల యువతి వింత ప్రయత్నం.. రాత్రిళ్లు రోడ్లపై నిల్చుని..

కొన్నిసార్లు అనుకోని విధంగా జీవితాలు తారుమారైపోతాయి. ఇప్పటికాలంలో ప్రమాదాలు ఎక్కువే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం పొంచి ఉంటుంది. ఆ అమ్మాయి కుటుంబంలోనూ అదే జరిగింది. ఒకే ఒక్క రాత్రిలో వారి జీవితాలు తలకిందులయ్యాయి. తల్లిలా తనకు గోరుముద్దలు పెట్టి, తండ్రిలా తనను భుజాల మీద ఎత్తుకుని తిప్పిన తన తాత దారుణంగా చనిపోయాడు.ఇంకెవరూ అలా మరణించకూడదనే ఆలోచనతో వింత ప్రయత్నం మొదలుపెట్టింది. రాత్రిళ్ళు రోడ్లపై నిలుచుకుని ఈ అమ్మాయి చేస్తున్న పనేంటి? ఈ అమ్మాయి ఎవరు మొదలయిన విషయాలలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow)లో ఖుషీ పాండే అనే అమ్మాయి ఉంది. లక్నోలోని అమీనాబాదులో ఖుషీ తాతయ్య సైకిల్ పై వెళుతుండగా ఒక కారు ఢీకొట్టింది. దీంతో ఖుషీ ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పొగమంచు కారణంగా కారు డ్రైవర్ కు ఖుషీ తాతయ్య ప్రయాణిస్తున్న సైకిల్ కనిపించలేదు. దీంతో కారు ఢీ కొట్టినట్టు విచారణలో తెలిసింది. కారణం ఏదైనా ఖుషీకి ఎంతో ఇష్టమైన తాతయ్య మరణించారు. తనను ప్రేమగా చూసుకునే తాతయ్య మరణించేసరికి ఖుషీ దుఃఖంలోకి వెళ్ళిపోయింది. కానీ అంతలోనే ఆమెకు ఓ విషయం అర్థమైంది. టూవీలర్స్ లో సైకిళ్ళకు లైట్లు ఉండవు.సైకిళ్ళకు లైట్లు ఉంటే ఆ లైట్లను చూసి కారు డ్రైవర్ తన తాతయ్య సైకిల్ ను గుర్తించేవాడు. సైకిళ్ళకు లైట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరగిందని ఆమెకు అర్థమైంది. ఈ విషయం అర్థం అవ్వగానే తన తాతయ్యలా ఇంకెవరూ చనిపోకూడదని అనుకుంది. దీనికోసం బ్లింకర్ లైట్లు(Blinker Lights) కొనుగోలు చేసింది. రహదారుల మీద సైకిళ్ళలో వచ్చిపోయే వ్యక్తులను ఆపి వారికి ఉచితంగా బ్లింకర్ లైట్లను ఇస్తోంది. వాటిని సైకిళ్లకు అమర్చడం రానివారి సైకిళ్లకు తనే వాటిని సెట్ చేస్తుంది. 2020లో ఖుషీ తాతయ్య చనిపోగా.. అప్పటినుండి ఖుషీ బ్లింకర్ లైట్లు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు దాదాపు 1500సైకిళ్ళకు ఈ లైట్లు అమర్చినట్టు తెలిసింది.

తాతయ్యను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా తనలా ఎవరూ కుటుంబ సభ్యులను కోల్పోకూడదని ఆరాటపడుతున్న ఈ 23ఏళ్ల అమ్మాయిని సోషల్ మీడియా గుర్తించింది. ఖుషీ లక్నో రహదారుల్లో సైకిళ్లు నడిపేవారికి బ్లింకర్ లైట్లను అమరుస్తున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను Awanish Sharma అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. God Bless You అనే క్యాప్షన్ ఈ వీడియోకు జోడించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఖుషీ చేస్తున్నపనిని మెచ్చుకుంటున్నారు. ఈ అమ్మాయి ప్రయత్నం చాలా గొప్పదని కితాబులిస్తున్నారు.

Read also: Tea: అతిగా టీ తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు కానీ.. అసలు ఏఏ అనారోగ్య సమస్యలు వస్తాయో తెలిస్తే..!


Updated Date - 2023-03-23T17:54:07+05:30 IST