Tea: అతిగా టీ తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు కానీ.. అసలు ఏఏ అనారోగ్య సమస్యలు వస్తాయో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-03-23T16:13:16+05:30 IST

చాయ్ అనేది ఒక ఎమోషన్ చాలా మందికి. అసలు చాయ్ తాగితే నిజంగా ఎనర్జీ వస్తుందా? రోజులో ఎక్కువ సార్లు చాయ్ తాగితే

Tea: అతిగా టీ తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు కానీ.. అసలు ఏఏ అనారోగ్య సమస్యలు వస్తాయో తెలిస్తే..!

ఫ్రెండ్స్ అంతా సరదాగా కబుర్లు చెప్పుకోవాలన్నా, డ్యూటీ టైంలో చిన్న బ్రేక్ తీసుకోవాలన్నా దగ్గర్లో ఉన్న టీ కొట్టు బెస్ట్ ఆప్షన్. ఈ ఛాయ్ గురించి మెగాస్టార్ డైలాగ్స్ తో కాకుండా ఏకంగా పాటతోనే ప్రమోషన్ ఇచ్చేశారు. నిజం చెప్పాలంటే చాయ్ అనేది ఒక ఎమోషన్ చాలా మందికి. ఏమాత్రం బెరుకు లేకుండా రోజులో ఒకటి రెండు సార్లకంటే కూడా ఎక్కువ తాగేస్తారు. అయితే టీ అయినా.. కాఫీ అయినా అతిగా తాగడం(Drinking Too-much Coffee or Tea is danger) ఆరోగ్యానికి హానికరం అనే మాట మనం వింటూనే ఉంటాం. కానీ ఆ మాటలను పక్కన పెట్టేసి మరీ చాయ్ సిట్టింగ్ వేస్తాం. అసలు చాయ్ తాగితే నిజంగా ఎనర్జీ వస్తుందా? రోజులో ఎక్కువ సార్లు చాయ్ తాగితే ఏమవుతుంది? చాయ్ గురించి ఓ చిన్న సీక్రేట్ సిట్టింగ్ అందరూ చదవండి మరీ..

కాఫీలో అయినా టీలో అయినా కెఫిన్(Caffeine) ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఒక కప్పు టీలో 40మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. ఈ లెక్కన రోజులో రెండు కంటే ఎక్కువ సార్లు టీ తాగితే 80మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ మన శరీరంలోకి వెళుతుంది. కొందరు పెద్ద పెద్ద గ్లాసులతో టీ తాగేస్తారు. దీనివల్ల ఎక్కువ కెఫిన్ శరీరంలోకి వెళుతుంది. ఈ కెఫిన్ ఒకరకమైన మత్తుపదార్థం. ఈ కారణంగా ఇది రోజులో ఎక్కువ శాతం శరీరంలో చేరితే.. స్లో పాయిజన్ లా శరీరంలో అవయవాలను దెబ్బతీస్తుంది. పైపెచ్చు టీలో కలుపుకునే చక్కెర వల్ల షుగర్ స్థాయిలు(ఏహుోీ తానాతే) పెరుగుతాయి.

ఉదయాన్నే టీ తాగేవాళ్లకు చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. ఈ కారణంగా రోజు మొత్తం తీసుకునే ఆహారం జీర్ణమయ్యే విషయంలో సమస్యలు తలెత్తుతాయి.

రోజుకు రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగేవారికి మానసిక ఆరోగ్యం(Mental Health) తొందరగా దెబ్బతింటుంది. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఇవి మాత్రమే కాకుండా ఎసిడిటీ, మొటిమలు రావడం, నిద్రలేమి, అల్సర్, ఎముకలు బలహీనం అవడం, శరీరంలో తేమశాతం తగ్గిపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఆహారం వల్ల ఇలా అవుతోందని అనుకునేవారు ఎక్కువ. కానీ ఇది చాలా తప్పు.

టీ తాగే అలవాటు ఉన్నవారు టీ చేసుకుని అప్పటికప్పుడు తాగెయ్యాలి. దాన్ని అలాగే ఉంచి మళ్ళీ వేడిచేయడం వల్ల ఆ టీలో క్యాన్సర్ కారకాలు అభివృద్ది చెందుతాయి. అలాగే టీ తాగగానే మంచి నీళ్ళు తాగకూడదు. దీనివల్ల విరేచనాలు, జలుబు, గొంతుమంట, పంటినొప్పి, పళ్ళు పసుపురంగులోకి మారడం, సున్నితంగా మారిపోవడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఇతర శీతల పానీయాలు తాగితే ముక్కుల్లో రక్తం కారడం వంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఐరన్ సప్లిమెంట్స్ తో టీ తీసుకుంటే ఇందులో ఉండే టానిన్లు, ఆక్సలేట్లు శరీరం ఐరన్ గ్రహించకుండా చేస్తాయి. తీసుకునే టీ కొంచెమయినా చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తే చాలా మంచిది.

Read also: Viral Video: కోట్ల ఆస్తి ఉన్నా పిల్లికి బిచ్చం పెట్టని వారున్న ఈ రోజుల్లో.. ఈ మూగజీవాలే నయం.. ఈ గుర్రం చేసిన పనేంటో చూస్తే..


Updated Date - 2023-03-23T16:13:16+05:30 IST