Viral News: సోషల్ మీడియాలో చూసి ఒక్కసారి ట్రై చేసింది.. చివరకు ముఖం ఇలా తయారయింది.. ఈ మహిళ అసలేం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-05-30T17:14:14+05:30 IST

ఓ మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి దాన్ని ఫాలో అయ్యింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె ముఖం దారుణంగా..

Viral News: సోషల్ మీడియాలో చూసి ఒక్కసారి ట్రై చేసింది.. చివరకు ముఖం ఇలా తయారయింది.. ఈ మహిళ అసలేం చేసిందంటే..!

ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నవారు చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ లో చాలా సింపుల్ అంటూ ఎన్నో వీడియోలు చూస్తూంటాం. ఓ మహిళ అలాగే సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి దాన్ని ఫాలో అయ్యింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె ముఖం దారుణంగా తయారైంది. ఇంతకూ ఆమె ముఖం దారుణంగా తయారవడం వెనుక కారణం ఏంటి? ఆమె ఏం చేసింది? తెలుసుకుంటే..

బ్రిటన్(Britain) కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాను ఫాలో అయ్యి చేసిన ఒక పని చాలా దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. బ్రిటన్ లో నివసిస్తున్న షఫియా బషీర్ అనే మహిళకు సోషల్ మీడియాలో ఎక్కువ సేపు కాలం వెళ్ళబుచ్చడం అలవాటు(women spend more time on social media). ఆమె టిక్ టాక్(Tik tok), యూట్యూబ్ షార్ట్స్ (You Tube Shorts) చాలా పిచ్చగా ఫాలో అవుతుంది. ఒకరోజు ఆమెకు ఆమె అత్తగారు ఒక టిక్ టాక్ (Mother-in law share a tik tok video)వీడియో పంపించారు. అందులో గుడ్లను చాలా వెరైటీగా వండటం (eggs cooking variety method)చూపించారు. ఆ వీడియో చూడగానే బషీర్ కు ఆ డిష్ తయారుచెయ్యాలని అనిపించింది. వీడియోలో చూపించినట్టుగా గుడ్లను 37డిగ్రీల వద్ద మైక్రోవేవ్ లో(eggs boil in micro wave) ఉంచింది. ఆ తరువాత వాటిని బయటకు తీసి వేడిగా ఉండగానే పెంకు తీయడానికి ప్రయత్నించింది(women try to remove egg shell while hot). కానీ ఆమె ఊహించని విధంగా గుడ్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆమె నోరు సగం పైగా(Mouth burn) కాలిపోయింది. ఇక ముఖం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం ఆమె ముఖం సగం పైగా కాలిపోయింది.

Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..


ప్రమాదం జరిగిన వెంటనే షఫియా బషీర్ ముఖం పెదవులు మొదలయిన ప్రాంతాలలో చర్మం తొలగిపోయింది. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కుళాయి కింద తన ముఖాన్ని ఉంచింది. దీంతో ఆమె ముఖానికి కొంతలో కొంత ఉపశమనం లభించింది. దీని తరువాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె మాట్లాడుతూ 'ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా గుడ్లు వండాను కానీ మైక్రోవేవ్ లో వండలేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిస్తే గుడ్లు వండేదాన్ని కాదు' అని వాపోయింది. 'ఇప్పుడు నాకు గుడ్లతో వంటకం వండాలంటేనే భయమేస్తోంది' అని చెప్పుకొచ్చింది. కాగా షఫియా బషీర్ కు ఎదురైన అనుభవం గురించి చదివిన నెటిజన్లు కొత్త కొత్త వంటకాలు వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్ అని అంటున్నారు.

Viral News: అయ్యయ్యో.. ఇదేం విచిత్రం.. ఓ పక్షిని కాపాడబోయి.. రూ.లక్ష నష్టపోయిన యువతి..!


Updated Date - 2023-05-30T18:29:21+05:30 IST