Viral News: అమ్మ బాబోయ్.. 22 ఏళ్ల ఈ యువతికి ప్రతీ నెలా రూ.41 లక్షల ఆదాయం.. ఏం చేసి అంత సంపాదిస్తోందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-23T13:49:47+05:30 IST

22ఏళ్ల అమ్మాయి నెలకు ఏకంగా 41లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఆమె ఏం చేసి అంత డబ్బు సంపాదిస్తోందో తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో.. ఇదేం చోద్యం! ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా?' అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral News: అమ్మ బాబోయ్.. 22 ఏళ్ల ఈ యువతికి ప్రతీ నెలా రూ.41 లక్షల ఆదాయం.. ఏం చేసి అంత సంపాదిస్తోందో తెలిస్తే..

కొంతమంది డబ్బు సంపాదించడం చాలా సులువు అంటుంటారు. కానీ లక్షలాది రూపాయలు సంపాదించాలంటే మాత్రం అంత ఈజీ ఏమీ కాదు. పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకున్నా ఎంతో సీనియార్టీ వస్తే తప్ప నెలకు లక్షకు పైన జీతం అందుకునే అవకాశం రాదు. కానీ జస్ట్ 22ఏళ్ల అమ్మాయి నెలకు ఏకంగా 41లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఆమె ఏం చేసి అంత డబ్బు సంపాదిస్తోందో తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో.. ఇదేం చోద్యం! ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా?' అని ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

లతీషా జోన్స్ అనే అమ్మాయి ఇంగ్లండ్(England) లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయడానికి(Medicine in Manchester university) వెళ్ళింది. అక్కడ ఉంటూ ఆమె తన అవసరాల కోసం టెస్కోలోని సూపర్ మార్కెట్(work in super market) లో పనిచేసేది. ఇది మాత్రమే కాకుండా ఆమెకు వీలున్నప్పుడల్లా ఒక వెబ్సైట్ కోసం పనిచేసేది. చదువుకుంటూ ఎంత పనిచేసినా ఆమెకు పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కానీ డాక్టర్ కావాలనే తన కల కారణంగా అలా కంటిన్యూ చేసేది. ఒకరోజు ఆమె దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. 'నాకు ఒక బాటిల్ ఉమ్మి(split) కావాలి ఇస్తారా? డబ్బు చెల్లిస్తాను' అని అడిగారు. ఆ మాట వినగానే ఆమె 'వీడికి జోకులెయ్యడానికి నేనే దొరికానా?' అన్నట్టు ఫీలైంది. కానీ అతను నిజంగానే ఉమ్మి కావాలని అడుగుతుండటంతో ఆమె షాకయ్యింది. ఆ తరువాత అతను అడిగినట్టు ఒక బాటిల్ లో తన ఉమ్మిని నింపి అక్షరాలా 300పౌండ్లు అంటే.. 31వేల రూపాయలకు(Bottle split sell for 31thousand rupees) అమ్మింది. అతనేమైనా పిచ్చోడేమో అని ఆమె అనుకుంది. కానీ ఆ సంఘటన తరువాత ఆమెకు ఈ రకమైన సంప్రదింపులు ఎక్కువయ్యాయి. రోజుకు మూడు సీసాల వరకు ఉమ్మిని బాటల్స్ లో నింపుతుంది. ఓ వ్యక్తికి మూడు బాటిల్స్ ను గరిష్టంగా 1.54లక్షల రూపాయలకు అమ్మింది. ఈ సంఘటన తరువాత మరింత విచిత్రమైన డిమాండ్లు ఆమెకు వచ్చాయి. కొందరు బాగా చెమట పట్టి చెమట వాసన వస్తున్న జిమ్ బట్టలు కావాలని, వారం పాటు వినియోగించిన బెడ్ షీట్ కావాలని అడిగారు. ఇవి మాత్రమే కాకుండా స్నానానికి వాడిన నీరు, ఉపయోగించిన టూత్ బ్రష్, ఉమ్మి వేసిన టూత్ పేస్ట్, ఇలా చాలా కావాలని ఆమెను ఎప్పుడూ సంప్రదిస్తూ ఉండేవారు. దీంతో ఆ యువతి కూడా వాటిని అమ్మడం మొదలుపెట్టింది.

split.gif

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..


ఆదాయం బాగా ఉండటంతో తన మెడిసిన్ చదువు కూడా వదిలేసి ఇదే పనిని వృత్తిగా ఎంచుకుంది. నాలుగేళ్ళ నుండి ఇదే పని చేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఉమ్మిని, తదితరాలను అమ్మడం ద్వారా ఆమె నెలకు గరిష్టంగా 41లక్షలు సంపాదిస్తోంది. వచ్చిన డబ్బుతో ఆమె చేసిన 11లక్షల అప్పు తీర్చేసింది. సొంత కారు, సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఉమ్మిని అమ్ముతూ వారానికి కనిష్టంగా 3నుండి 5వేల పౌండ్లు సంపాదిస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీలో 2.77లక్షల నుండి 4.63 లక్షల రూపాయలు. కాగా ఇలా కొన్న ఉమ్మిని, చెమట దుస్తులు, బెడ్ షీట్లను ఏమి చేస్తున్నారనే విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు.

Viral Video: బండిని ఓ మహిళ డ్రైవ్ చేస్తోంటే.. కారులో వెళ్తూ ఎవరో వీడియో తీస్తున్నారని.. వెనుక కూర్చున్న యువతి ఏం చేసిందో చూస్తే..!


Updated Date - 2023-05-23T13:49:47+05:30 IST