Viral Video: బండిని ఓ మహిళ డ్రైవ్ చేస్తోంటే.. కారులో వెళ్తూ ఎవరో వీడియో తీస్తున్నారని.. వెనుక కూర్చున్న యువతి ఏం చేసిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-22T16:37:00+05:30 IST

బైక్ మీద వెనక కూర్చున్న మహిళ కారులో కుర్రాడు తమను వీడియో తీస్తుండటం గమనించింది. వెంటనే ఆమె చేసిన పనికి వీడియో తీస్తున్న కుర్రాడు షాకయ్యాడు. ఆ తరువాత జరిగిందేంటో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: బండిని ఓ మహిళ డ్రైవ్ చేస్తోంటే.. కారులో వెళ్తూ ఎవరో వీడియో తీస్తున్నారని.. వెనుక కూర్చున్న యువతి ఏం చేసిందో చూస్తే..!

ప్రస్తుతకాలంలో గ్రామీణ ప్రాంతాలు కూడా చాలా అప్డేట్ అయ్యాయి. తమ పనులు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా స్కూటీ, టీవియస్ వంటి వాహనాలు నడుపుతూంటారు. ఓ మహిళ మోపెడ్ బైక్ నడుపుతోంటే.. ఆమె వెనక ఓ యువతి కూర్చుని ఉంది. వారిద్దరూ రహదారిమీద వెళుతున్నారు. కారులో వెళుతున్నఓ కుర్రాడు ఆ మహిళలు బైక్ మీద వెళుతుండటం చూశాడు. వెంటనే వారిద్దరినీ తన మొబైల్ లో వీడియో తీయడం మొదలు పెట్టాడు. బైక్ మీద వెనక కూర్చున్న మహిళ కారులో కుర్రాడు తమను వీడియో తీస్తుండటం గమనించింది. వెంటనే ఆమె చేసిన పనికి వీడియో తీస్తున్న కుర్రాడు షాకయ్యాడు. ఆ తరువాత జరిగిందేంటో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహిళలు బైక్ నడపడం(Women's bike driving) ఒకప్పుడు వింత విషయం కానీ ఇప్పుడు కాదు. ఇప్పట్లో స్కూల్ అమ్మాయిల నుండి 50ప్లస్ మహిళలు కూడా సునాయాసంగా బైక్ నడుపుతారు. గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈ విషయంలో అప్డేట్ అయ్యారు. డైరీలో పాలు పోసి రావడానికి, పశువులకు గడ్డి తీసుకురావడానికి, పొలం పనులకు వెళ్ళడానికి మహిళలు బైక్ వాడటం చాలా చోట్ల చూస్తూంటాం. వీడియోలో ఓ పెద్దావిడ(Old women) టీవియస్ మోపెడ్ బైక్(TVS moped bike) నడుపుతోంటే వెనకాల ఓ యువతి(Young lady) కూర్చుంది. వారిద్దరూ రహదారి మీద ఎంతో ఉత్సాహంగా వెళుతున్నారు. వారు వెళ్తున్న రహదారికి కొద్ది దూరంలో మరొక రహదారి ఉంది. ఆ రహదారి మీద ఓ కారు వెళుతోంది. ఆ కారులో కుర్రాడు(Young man) మోపెడ్ బైక్ మీద వెళుతున్న మహిళలను చూశాడు. అతను వెంటనే ఆ మహిళలను వీడియో (Man record video of women's)తీయడం మొదలుపెట్టాడు. కొన్ని సెకెన్ల తరువాత బైక్ మీద వెనుక సీట్లో కూర్చున్న యువతి కారులో కుర్రాడు తమను వీడియో తీయడం గమనించింది. ఆమె వీడియో తీస్తున్న కుర్రాడి వైపు తలతిప్పి తన చెయ్యి ఊపింది(hand waving). అది చూడగానే వీడియో తీస్తున్న కుర్రాడు ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. ఆ తరువాత బైక్ డ్రైవ్ చేస్తున్న పెద్దావిడ కూడా వీడియో తీస్తున్న కుర్రాడి వైపు చూస్తూ చెయ్యి ఊపింది. చాలామంది మహిళలు తమ అనుమతి లేకుండా వీడియోలు తీసినా, ఫోటోలు తీసినా చాలా సీరియస్ అవుతారు. కానీ ఈ మహిళలు మాత్రం ఏవిధమైన కోపం చూపించలేదు. పైపెచ్చు ఎంతో స్నేహపూర్వకంగా హాయ్ చెప్పారు.

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..


ఈ వీడియోను shabzyed అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) షేర్ చేశారు. 'బైక్ మీద ఎగిరిపోతున్న ఇద్దరు నైటెంగిల్స్' అనే క్యాప్షన్ ను మలయాళంలో పెట్టారు. దీన్ని బట్టి ఇది కేరళలో(Kerala) జరిగిన సంఘటనగా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తరువాత చాలా పాజిటివ్ గా స్పందించారు. 'ఆ మహిళల రియాక్షన్ ఎవరూ ఊహించలేనిది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'వారు వీడియో తీయడం చూసి పాజిటివ్ గా స్పందించడం హైలెట్' అని అంటున్నారు.

Slum Girl: బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందో కంపెనీ.. ఇంతకీ ఈ అమ్మాయి కథేంటంటే..!


Updated Date - 2023-05-22T16:37:00+05:30 IST