Viral News: 48 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం.. హిజ్రాను వివాహం చేసుకుని ఊరందరికీ పెళ్లి విందు..!

ABN , First Publish Date - 2023-04-18T18:46:20+05:30 IST

48ఏళ్ల వయసులో మగవాళ్లు ఎలా ఉంటారు? పదో, ఇంటరో చదివే పిల్లలకు తండ్రులుగా కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం

Viral News: 48 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం.. హిజ్రాను వివాహం చేసుకుని ఊరందరికీ పెళ్లి విందు..!

సాధారణంగా 48ఏళ్ల వయసులో మగవాళ్లు ఎలా ఉంటారు? పదో, ఇంటరో చదివే పిల్లలకు తండ్రులుగా కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం తన 48ఏళ్ళ వయసులో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. హిజ్రాను వివాహం చేసుకుని ఊరందరికీ పెళ్ళివిందు ఇచ్చాడు.ఈ విందులో పాల్గొన్నవారు, ఇతని గ్రామస్తులు అందరూ ఇతను చేసిన పనికి ముక్కున వేలేసుకుంటున్నారు. అసలింతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అతను హిజ్రాను పెళ్ళిచేసుకోవడానికి కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం హమీర్ పూర్(Hamirpur) జిల్లాలో చికాసి పోలిస్ పరిధిలో ఖంగరన్ అనే గ్రామముంది. ఈ గ్రామంలో నాథూరామ్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో చిన్నకొడుకు ఛత్రపాల్ సింగ్. ఇతనికి 48ఏళ్ల వయసొచ్చినా పెళ్ళికాలేదు. నాథూరామ్ సింగ్ పెద్దకొడుకుకు కూడా చాలా ఏళ్లుగా పెళ్లిలేదు. ఈ మధ్యనే అతను వివాహం చేసుకున్నాడు. దీంతో ఛత్రపాల్ సింగ్ ఒంటరివాడైపోయాడు. తనకూ ఓ తోడుడుంటే బావుంటుందని అనిపించింది. కానీ ఆ వయసులో తనకు పిల్లనిచ్చేవాళ్ళు లేరు. దీంతో ఛత్రపాల్ సింగ్ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. బిల్లో రాణి అనే హిజ్రాను(hijra) జీవిత భాగస్వామిగా చేసుకోవాలని అనుకున్నాడు. ఆమెను గ్రామంలోని సతీమాత ఆలయానికి(sathi matha temple) తీసుకెళ్ళాడు. ఆ ప్రాంతంలో వారికి సతీమాత ఆలయంలో ఉన్న రాతి స్తంభం కింద కూర్చుని పెళ్ళిచేసుకోవడం ఆచారం. ఛత్రపాల్ సింగ్, బిల్లో రాణి ఇద్దరూ ఒక్క ఆచారం కూడా తప్పకుండా వారి సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకున్నారు. పూజారి దగ్గరుండి వీరి పెళ్ళి జరిపించారు. అందరిలానే వీరు కూడా మూడుముళ్ళ ఏడడుగులతో ఒక్కటయ్యారు.

Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..


గుడిలో వీరి పెళ్ళి జరుగుతోందని తెలిసి గ్రామస్తులందరూ సతీమాత ఆలయానికి చేరుకున్నారు. అందరూ పెళ్ళి తంతును ఆశ్చర్యంగా చూశారు. పెళ్ళయిన వెంటనే ఛత్రపాల్ సింగ్ గ్రామస్తులందరికీ పెళ్ళి విందు ఏర్పాటు చేయించాడు. ఈ సంఘటన విన్నవాళ్లు అతను ఓ హిజ్రాకు కొత్తజీవితాన్ని ఇచ్చాడని ఛత్రపాల్ సింగ్ ను మెచ్చుకుంటున్నారు.

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


Updated Date - 2023-04-18T18:46:20+05:30 IST