Viral News: భార్య విడాకులివ్వడంతో పిచ్చగా ఎంజాయ్ చెయ్యాలని టూరుకెళ్ళాడు.. అక్కడేం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-09T16:41:50+05:30 IST

భార్య విడాకులు ఇచ్చిందనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టూర్ కు వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన..

Viral News:  భార్య విడాకులివ్వడంతో  పిచ్చగా ఎంజాయ్ చెయ్యాలని టూరుకెళ్ళాడు.. అక్కడేం జరిగిందో తెలిస్తే..

పెళ్ళంటే పదిమంది మాట్లాడుకునేలా ఉండాలని ఎంతో ఘనంగా చేస్తారంతా.. అయితే ప్రస్తుత కాలంలో విడాకులు కూడా పెళ్ళి సంబరానికి ఏమీ తీసిపోవడం లేదు. కొంతమంది ఫోటో షూట్ లు చేస్తున్నారు, మరికొందరు పండగ చేసుకుంటున్నారు. వీళ్లలాగే ఓ వ్యక్తి తన భార్య విడాకులు ఇచ్చిందనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టూర్ కు వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన గురించి తెలిసి అందరూ షాకవుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అప్పుడెప్పుడో వచ్చిన ఆహ్వానం సినిమాలో విడాకులకు వేడుక ఏర్పాటు చేయిస్తుంది శివగామి రమ్యకృష్ణ. అలా వేడుక ఏర్పాటు చేసి విడాకులు తీసుకోకపోయినా ఇప్పట్లో చాలామంది విడాకులు రాగానే సెలబ్రేషన్స్(celebrations) చేసుకుంటున్నారు. అన్నిరోజులూ జీవిత భాగస్వామి వల్ల కోల్పోయిన సంతోషాన్ని భర్తీ చేసుకుంటున్నారు. పోర్చుగల్(Portugal) దేశానికి చెందిన రాఫెల్ అనే 22ఏళ్ళ వ్యక్తి తన భార్యతో బాగా విసిగిపోయాడు. తరచుగా గొడవలు పడేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం పెరిగింది. వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రాఫెల్ నిరీక్షణకు ఫలితంగా భార్య విడాకులు(divorce) ఇచ్చింది. ఇంకేముంది పంజరం నుండి బయటపడిన పక్షిలా ఫీలైపోయాడు. తన సంతోషాన్ని ఎంజాయ్ చెయ్యడానికి వెంటనే ట్రిప్ కు ప్లాన్(planned for trip) చేశాడు. అతను బ్రెజిల్(Brazil) వెళ్ళి అక్కడ బంగీ జంప్(bungee jump) చెయ్యాలనేది అతని ప్లాన్. అనుకున్నట్టే బ్రెజిల్ చేరుకున్నాడు.

Tea: టీ తాగడానికి ముందు, తాగిన తరువాత నీళ్ళు తాగుతుంటారా? దానివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే..


బ్రెజిల్ లో 70 అడుగుల లోతు(70 feet deep Valley)లో ఉన్న లోయ దగ్గర బంగీ జంప్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని 70అడుగుల ఎత్తు(70 Feet height) నుండి లోయలోకి దూకాడు. అయితే అతని దురదృష్టమో ఏమో వెంటనే అతనికి కట్టిన తాడు తెగిపోయింది(rope is broken). దీంతో అతను లోయలోకి(fall in valley) పడిపోయాడు. అతను చనిపోయి ఉంటాడని అక్కడ బంగీ జంప్ నిర్వహకులు అనుకున్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది కిందకు వెళ్లి అతనికోసం చాలా వెతికారు. గంటల తరబడి వెతికిన తరువాత అతన్ని లోయనుండి బయటకు తీశారు. హాస్పిటల్ కు తీసుకెళ్ళగా అతని శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయినట్టు(bones are broken) వైద్యులు తెలిపారు. అతని గురించి వైద్యులు విచారించగా విడాకులు వచ్చిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చానని అతనే స్వయంగా చెప్పాడు. 'విడాకుల తరువాత జీవితాన్ని అన్నివిధాలా సంతోషంగా గడపాలని అనుకున్నాను, అంతలోనే ఇలా జరిగింది అంటూ వాపోయాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు,

Viral Video: పాకిస్తాన్ మరీ ఇంత దారుణంగా తయారయ్యిందేంటి? అరటి పళ్ళు అమ్ముకోడానికి ఓ చిన్న పిల్లాడు రహదారిమీదకు వస్తే ప్రజలంతా ఏం చేశారో చూడండి..


Updated Date - 2023-05-09T17:58:23+05:30 IST