Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పట్టుమని పదేళ్లు కూడా ఉండవు కానీ.. 27 అంతస్తుల భవనం అంచున ఇద్దరు పిల్లల నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2023-04-07T17:06:43+05:30 IST

సాధారణంగా పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులు ఇష్టపడరు. ఎందుకంటే మెచ్యూరిటీ లేని పిల్లలు ఏం చేస్తారోనన్న భయం. అంతకీ తప్పదు అనుకుంటే ఇంటి పక్కన ఉన్న వాళ్లకో... లేదంటే తెలిసిన వాళ్లింట్లోనూ పెట్టి మరీ వెళ్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక.. బాబోయ్.. అనకమానరు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పట్టుమని పదేళ్లు కూడా ఉండవు కానీ.. 27 అంతస్తుల భవనం అంచున ఇద్దరు పిల్లల నిర్వాకమిదీ..!
Viral Video

సాధారణంగా పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టి బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రులు ఇష్టపడరు. ఎందుకంటే మెచ్యూరిటీ లేని పిల్లలు ఏం చేస్తారోనన్న భయం. అంతకీ తప్పదు అనుకుంటే ఇంటి పక్కన ఉన్న వాళ్లకో... లేదంటే తెలిసిన వాళ్లింట్లోనూ పెట్టి మరీ వెళ్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక.. బాబోయ్.. అనకమానరు.

సోషల్ మీడియా (social media) వచ్చాక గుర్తింపు కోసం రకరకాలైన విన్యాసాలు చేసి పోస్టులు పెడుతుంటారు. మరికొందరు ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న దాఖలు కూడా ఉన్నాయి. కానీ పిల్లలకు ఇలాంటివేమీ తెలియవు. ఓ ఇద్దరు పిల్లలు (two boys standing) మాత్రం అత్యంత ఎత్తైన భవంతులపైకి ఎక్కి వారు చేసిన విన్యాసాలు చూస్తుంటే.. చూసేవాళ్లకే గుండె ఆగేటట్టుంది.

చైనా(China) లో ఇద్దరు పిల్లలు 27 అంతస్తులన్న భవనం పైకి ఎక్కారు. చూడ్డానికి చాలా చిన్న పిల్లల్లా ఉన్నారు. రెండు భవనాలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. ఓ పిల్లోడు.. ఆ రెండు భవనాలపై (building) అటు ఇటు ప్రమాకరంగా దూకడం చేశాడు. మరో పిల్లోడు కూడా దూకేందుకు ప్రయత్నించాడు కానీ ఆ సాహసం చేయలేదు. దూరం నుంచీ దీన్ని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీస్తూనే యాజమాన్యానికి సమాచారం అందించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై పిల్లలిద్దర్నీ సురక్షితంగా కిందకు దించారు.

ఇది కూడా చదవండి: Shocking News: ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి..? వద్దన్నా హెయిర్ కటింగ్ చేయించారని బాత్రూంలోకి వెళ్లి మరీ..

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్న ఈ వీడియో 2021లో జరిగిన సంఘటన. ఈ వీడియోను బుధవారం ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతే ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. వీడియో తీసిన వ్యక్తి కూడా భవనాల ఎత్తును చూపిస్తూ... ఎంత ప్రమాదకరంగా దూకుతున్నారో చూపించాడు. ఏ మాత్రం పట్టుతప్పినా ఇక అంతే సంగతులు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. కొంత మంది ఆశ్చర్యపోతూ ఇలాంటి విన్యాసాలు చేయొద్దని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ బుడ్డోళ్లు చేసిన విన్యాసాలను మీరు కూడా చేసేయండి.

225.jpg

Updated Date - 2023-04-07T17:06:43+05:30 IST