Uttarakhand: కూతురి పెళ్లిని నిలిపివేసిన కన్నతండ్రి.. కారణం ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2023-05-21T12:58:53+05:30 IST

ఈ నెల మే 28న పెళ్లి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శుభలేఖలు కూడా కొట్టించి ఆహ్వానాలు కూడా పంపించారు. కానీ అనూహ్యంగా ఆ వివాహం ఆగిపోయింది. వధువు కన్నతండ్రే రద్దు చేశారు. ఉత్తరఖండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Uttarakhand: కూతురి పెళ్లిని నిలిపివేసిన కన్నతండ్రి..  కారణం ఏంటో తెలుసా..

ఈ నెల మే 28న పెళ్లి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శుభలేఖలు కూడా కొట్టించి ఆహ్వానాలు కూడా పంపించారు. కానీ అనూహ్యంగా ఆ పెళ్లి ఆగిపోయింది. వధువు కన్నతండ్రే రద్దు చేశాడు. ఉత్తరఖండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తరఖండ్‌‌లోని పౌరీ మున్సిపాలిటీ చెర్మైన్, బీజేపీకి చెందిన యశ్‌పాల్ బెనమ్ ఈ నెల 28న జరగాల్సిన తన కూతురిని పెళ్లిని వాయిదా వేశారు. ఒక ముస్లిం యువకుడితో తన కూతురి వివాహానికి తొలుత నిశ్చయించారు. కానీ ముస్లిం వ్యక్తితో పెళ్లి ప్రతిపాదనపై హిందుత్వ సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో యశ్‌పాల్ ఈ పెళ్లిని నిలిపివేశారు. ఈ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది. దీంతో బీజేపీ మద్ధతుదారులతోపాటు ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు కూడా యశ్‌పాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూతురిని ముస్లిం వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తున్నారంటూ విమర్శించారు. దీంతో పెళ్లి ఆపివేయాలని నిర్ణయించుకున్నట్టు యశ్‌పాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కూతురి సంతోషం కోసం ముస్లిం యువకుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నానని, కానీ ఈ పెళ్లి ప్రతిపాదనపై సోషల్ మీడియా యూజర్లు స్పందించిన తీరు కారణంగా వాయిదా వేసుకున్నానని ఆయన చెప్పారు. ‘‘ఇప్పుడు నేను జనాల మాట కూడా వినాలి’’ అని బెనమ్ తెలిపారు. 28న పౌరీ సిటీలో జరగాల్సిన పెళ్లి రద్దయ్యిందని చెప్పారు. కాగా యశ్‌పాల్ ప్రతిపాదనను నిరసిస్తూ హిందుత్వ సంస్థలు శుక్రవారం స్థానికంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. వీహెచ్‌పీ, భైరవ్ సేన, బజరంగ్ దళ్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇలాంటి పెళ్లిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వీహెచ్‌పీ జిల్లా దీపక్ గౌడ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-21T13:07:51+05:30 IST