Viral News: బైక్‌పై వెళ్తున్న అతడికి గుండె ఆగిపోయినంత పనయింది.. కాలికి ఏదో తగులుతున్నట్టు అనిపించడంతో కిందకు వంగి చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-31T18:02:42+05:30 IST

మీకు బైకుందా? మీరు ఎప్పటిలాగానే పార్కు చేశారా? అయితే మీకో అలర్ట్.. మీరు బైకు బయటకు తీసేటప్పుడూ జర జాగ్రత్త! ఎందుకంటారా?

Viral News: బైక్‌పై వెళ్తున్న అతడికి గుండె ఆగిపోయినంత పనయింది.. కాలికి ఏదో తగులుతున్నట్టు అనిపించడంతో కిందకు వంగి చూస్తే..!
Two snakes

మీకు బైకుందా? మీరు ఎప్పటిలాగానే పార్కు చేశారా? అయితే మీకో అలర్ట్.. మీరు బైకు బయటకు తీసేటప్పుడూ జర జాగ్రత్త! ఎందుకంటారా? ఈ వార్త చదవండి. సంగతేంటో మీకే అర్థమవుతుంది.

సహజంగా పాములు అనేవి పొలాల్లోనో.. లేదంటే ఏ పుట్టల్లోనో ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇళ్లల్లోనూ సంచరిస్తున్నాయి. ఎండాకాలంలో అడవుల్లో చెరువులు.. కుంటలు ఎండిపోయి.. నీళ్లు దొరకక జంతువులు, విష సర్పాలు జనావాసాల్లోకి రావడం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

sn.jpg

ఏలూరు జిల్లాలోని (Eluru district) నూజివీడులో ఓ వ్యక్తి బైకులోకి పాము దూరింది. పార్క్ చేసిన బండిని స్టార్ట్ చేసి బయటకు వెళ్తుంటే ఏదో తన కాలికి చుట్టుకున్నట్టు వాహనదారుడికి అనిపించింది. ఏంటని చూడగా ఒక్కసారిగా హడలిపోయాడు. వెంటనే భయంతో బండిని నడిరోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు.

సతీష్ అనే డ్రైవర్.. ఓ మెకానిక్ షెడ్ దగ్గర తన బైక్‌ను పార్క్ చేశాడు. కొంచెం సేపటి తర్వాత పని చూసుకుని సతీష్ తన బైక్ తీసుకుని వెళ్తుండగా ఓ పాము (Two snakes) తన బైక్‌లో నుంచి వచ్చి సతీష్ కాళ్లకు చుట్టుకుంది. దీంతో సతీష్ బైక్ వదిలి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కాసేపటికి ఆ పాము కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇక పాము వెళ్లిపోయిందన్న ఉద్దేశంతో సతీష్.. తన బైక్‌ను తీసుకెళ్లేందుకు వచ్చాడు. కానీ అందులోంచి బుసలు కొడుతున్నట్టు శబ్దం వినిపించింది. ఇంకేముంది? ఇంకో పాము ఎక్కడైనా నక్కిందా? అని పరిశీలించగా.. బైక్ సీట్ కింద మరొక పాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో హడలెత్తిపోయిన సతీష్.. బైక్ వదిలి పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు చాకచక్యంగా బైక్ సీటు తొలగించి పామును బయటకు వచ్చేలా చేశారు. అనంతరం కర్రలతో దాని కొట్టి చంపారు. ఈ సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Bride: కొద్ది గంటల్లో పెళ్లనగా ఇంట్లోంచి 21 ఏళ్ల వధువు ఎస్కేప్.. ప్రియుడితో కలిసి పారిపోతుండగానే మృతి.. అసలేం జరిగిందంటే..!

ఇది కూడా చదవండి: Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Updated Date - 2023-05-31T18:02:42+05:30 IST