Viral Video: రోడ్డుపై ఈ స్కూటీని చూసి విస్తుపోతున్న జనం.. ఇందులో వింతేముందనుకుంటున్నారా..? ఒక్కసారి చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-03T11:55:48+05:30 IST

స్కూటర్ హ్యాండిల్‌బార్ వెనుక సీటు కింద ఉంటుంది. మొత్తంమీద ఆటో నిటారుగా కనిపించినా తలకిందులుగా నడుస్తుంది.

Viral Video: రోడ్డుపై ఈ స్కూటీని చూసి విస్తుపోతున్న జనం.. ఇందులో వింతేముందనుకుంటున్నారా..? ఒక్కసారి చూస్తే..!
scooter

మనలో చాలామంది వాడరు కానీ.. అందరిలోనూ ప్రత్యేకమైన టాలెంట్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ టాలెంట్ కి డిగ్రీల చదువుతో సంబంధం కూడా లేదు. ఇలాంటి శాస్త్రవేత్తలు మనచుట్టూ కోకొల్లలు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ గురంచే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. వివరాల్లోకి వెళితే.. ఎప్పుడో జమానాలో వచ్చిన స్కూటర్స్ ని ఇప్పుడు వాడటం లేదుకానీ అవి అప్పట్లో గొప్పగా నడిచిన బళ్ళు. అలాంటి బండితోనే ఈ కుర్రాడు కాస్త తిరగేసి ఆలోచించాడు. తారుమారు చేసేసిన ఇతని వింత ప్రయోగం గురించి తెలుసుకోవాలంటే..

రోడ్డుమీద వెళుతున్న కొత్త మోడల్ కార్లను, బైక్‌లను చూస్తున్నప్పుడు అబ్బా ఇలాంటి బైక్, కార్ మనకు ఉంటే బావుంటుంది అనుకుంటూ ఉంటాం. లేదా చాలా మంచి మోడల్ అని చూసి మురిసిపోతాం. ఇలాంటి ప్రత్యేకమైన వాహవాలకు మన దేశంలో కొదవలేదు. కానీ ఇలాంటి వాటికి కాస్త భిన్నంగా ఉన్న ఈ బైక్ మాత్రం గురించి తెలుసుకుని తీరాలి. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ స్కూటర్ గురించి చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. స్కూటర్ డిజైన్ కలలో కూడా ఆలోచించని విధంగా ఉంది.

ఇది కూడా చదవండి: కసరత్తులు అవసరం లేదండోయ్.. తింటూనే కొవ్వు కరిగించొచ్చు.. ఈ 5 ఆహార పదార్థాలను తింటే..!


స్కూటర్ సిస్టమ్ మొత్తం బోల్తా పడింది.

మొదటిసారి చూడగానే, ఈ స్కూటర్ సాధారణంగా కనిపిస్తుంది. అయితే దాన్ని రన్ చేసే విషయానికి వస్తే స్కూటర్ మొత్తం తలకిందులైంది. స్కూటర్‌ని రైడ్ చేయడానికి,దాని హ్యాండిల్‌తో పక్కన కూర్చోవాలి. చిన్నతనంలో నాన్నతో కలిసి స్కూటర్‌ నడుపుతున్నప్పుడు ఎక్కడ నిలబడి ఉండేవారు అచ్చం అలానే. స్కూటర్ హ్యాండిల్‌బార్ వెనుక సీటు కింద ఉంటుంది. మొత్తంమీద ఆటో నిటారుగా కనిపించినా తలకిందులుగా నడుస్తుంది.

ఈ వీడియో Instagram లో పోస్ట్ చేసారు. దీనికి ఇప్పటివరకు 13 లక్షల వీక్షణలు, 25 వేల లైక్‌లు వచ్చాయి. అలాగే, స్కూటర్ డిజైన్‌ను చూసి పబ్లిక్ షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రాని విధంగా స్కూటర్ నడపడంలో ఆనందం ఏంటన్నది అందరి ప్రశ్న.

Updated Date - 2023-08-03T11:55:48+05:30 IST