WhatsApp: అయ్యో పాపం.. వాట్సప్‌లో చేసిన ఒక్క మిస్టేక్‌తో ఓ టెకీకి రూ.42 లక్షలు మటాష్.. ఈ టిప్స్‌ను పాటిస్తే మీరు సేఫ్..!

ABN , First Publish Date - 2023-05-24T15:30:58+05:30 IST

వాట్సప్ వచ్చాక.. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో సమాచారం చేతుల్లోకి వచ్చేస్తోంది. అందుకే ప్రతీ ఫోన్‌లో వాట్సప్ ఉంటుంది. అసలు వాట్సప్‌ చూడకుండా ఉండలేని వాళ్లు ఉన్నారు. వాట్సప్ చూడకపోతే

WhatsApp: అయ్యో పాపం.. వాట్సప్‌లో చేసిన ఒక్క మిస్టేక్‌తో ఓ టెకీకి రూ.42 లక్షలు మటాష్.. ఈ టిప్స్‌ను పాటిస్తే మీరు సేఫ్..!
WhatsApp

వాట్సప్ వచ్చాక.. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో సమాచారం చేతుల్లోకి వచ్చేస్తోంది. అందుకే ప్రతీ ఫోన్‌లో వాట్సప్ ఉంటుంది. అసలు వాట్సప్‌ చూడకుండా ఉండలేని వాళ్లు ఉన్నారు. వాట్సప్ చూడకపోతే కనీసం ముద్ద కూడా దిగదు. అంతగా దానితో అనుబంధం కలిగి ఉన్న వారున్నారు. ఇక దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో.. అలాగే మన పర్సు కూడా ఖాళీ చేస్తోందని తాజా ఘటనతో రుజువైంది.

మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. పెద్దోళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఈ మాట. రోజూ ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. చూస్తూనే ఉంటున్నాం. వింటున్నాం. అయినా మోసపోతేనే ఉంటుంటారు. ఏదో అమాయకులు మోసపోయారంటే అనుకోవచ్చు. కానీ విద్యావంతులు కూడా ఈ లిస్ట్‌లో చేరడం విశేషం. గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (Software Engineer) మోసగాళ్ల వలలో చిక్కి ఏకంగా రూ.42 లక్షలు పోగొట్టు కోవడం సంచలనం సృష్టించింది. సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ ద్వారా అతడిని సంప్రదించి.. పార్ట్‌-టైమ్‌ ఉద్యోగం ఇస్తామని ఆశ జూపించారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో చేరాలని సూచించారు. టెక్నాలజీ గురించి బాగా తెలిసి ఉన్నప్పటికీ ఆ ఇంజినీరు నేరగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్నాడు.

ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఇలా చేయండి. రెండంచెల ధ్రువీకరణను యాక్టివేట్‌ చేసుకుంటే వాట్సప్‌ ఖాతా (WhatsApp scam) సురక్షితంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ఖాతా రీసెటింగ్‌, వెరిఫై చేస్తున్నప్పుడు ఆరు అంకెల పిన్‌ నంబర్‌ను అడుగుతుంది. ఇతరులు మన ఖాతాలోకి చొరబడకుండా కాపాడుతుంది. ఇక తెలియనివారి నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుచిత సమాచారాన్ని కోరినా.. విచిత్రమైన అభ్యర్థనలు చేసినా అనుమానించాలి. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దు. నేరుగా ఆ వ్యక్తులకు లేదా సంస్థలకు ఫోన్‌ చేసి ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ వారికి ఇవ్వద్దు. డబ్బులు పంపొద్దు. అలాగే అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు జవాబు ఇవ్వద్దు. ఇలాంటి కాల్స్‌ను వెంటనే బ్లాక్‌ చేయాలి. అనుమానిత ఖాతాల గురించి రిపోర్టు చేయాలి. అనుమానిత గ్రూప్‌ ఛాట్‌లో ఉన్నట్టు అనిపిస్తే వెంటనే దానిలోంచి బయటకు వచ్చేయాలి. దాని మీద ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా ప్రొఫైల్‌ ఫొటో, ఆన్‌లైన్‌ స్టేటస్‌ వంటి వివరాలను ఎవరెవరు చూడొచ్చనేది మనమే నిర్ణయించుకోవచ్చు. సెటింగ్స్‌లోని ప్రైవసీ విభాగం ద్వారా దీన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ స్టేటస్‌ను చూసేవారిని పరిమితం చేసుకుంటే భద్రతా పెరుగుతుంది. నమ్మకమైన కాంటాక్టులతోనే వ్యక్తిగత వివరాలను పంచుకోవాలి. వాట్సప్‌ ఖాతాకు అనుసంధానమైన పరికరాలను తరచూ సమీక్షించుకోవటం మంచిది. ఏదైనా తెలియని పరికరం కనిపిస్తే వెంటనే దాని నుంచీ లాగ్‌ అవుట్‌ కావాలి. అనుమానిత టెక్స్ట్‌, అభ్యర్థనలు అందినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అవి నిజమో, కాదో తెలుసుకోవాలి. లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. చిరునామా, ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. ఈ విధంగా వాట్సప్‌ను వాడుకుంటే క్షేమం. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: Bride: వారం రోజుల క్రితమే పెళ్లి.. ఇంట్లో కనిపించని భార్య.. తల్లిదండ్రులను అడిగినా తెలీదని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసిన ఆ భర్తకు..!

Updated Date - 2023-05-24T15:30:58+05:30 IST