Bride: వారం రోజుల క్రితమే పెళ్లి.. ఇంట్లో కనిపించని భార్య.. తల్లిదండ్రులను అడిగినా తెలీదని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసిన ఆ భర్తకు..!

ABN , First Publish Date - 2023-05-24T14:33:18+05:30 IST

కోటి విద్యలు.. కూటి కొరకే అన్నారు పెద్దలు.. ఈ సామెత బాగా వంటపట్టించుకున్నట్లుంది ఆ యువతీ. ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ ఈ జానెడు పొట్ట నింపుకోవడానికే.

Bride: వారం రోజుల క్రితమే పెళ్లి.. ఇంట్లో కనిపించని భార్య.. తల్లిదండ్రులను అడిగినా తెలీదని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసిన ఆ భర్తకు..!
Bride

కోటి విద్యలు.. కూటి కొరకే అన్నారు పెద్దలు.. ఈ సామెత బాగా వంటపట్టించుకున్నట్లుంది ఆ యువతీ. ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ ఈ జానెడు పొట్ట నింపుకోవడానికే. దీనికి లోకంలో బోలెడన్నీ మార్గాలున్నాయి. ధర్మాలు మాత్రం రెండే రెండు ఉన్నాయి. ఒకటి సక్రమం.. రెండోది అక్రమం.

కొంత మంది ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. దొర‌క‌నంత వ‌ర‌కు దొరల్లా తిరుగుతారు. దొరికితే పరువు పోగొట్టుకుంటారు. ఆమెకు కాళ్లూ చేతులూ అన్ని బాగానే ఉన్నాయి. కష్టపడితే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కానీ తన అందాన్ని పెట్టుబడిగా పెడుతూ యువకులకు గాలం వేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. దొరికినకాడల్లా దోచుకుని పరారయ్యేది. ఎట్టకేలకు పాపం పండి కటకటాల పాలైంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది (Gujarat police).

పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ డబ్బులు తీసుకుని యువకులను నట్టేటా ముంచేస్తున్న ఓ నిత్య పెళ్లికూతురు (thief bride) పోలీసుల చేతికి చిక్కింది. గత ఏడాది కాలం నుంచీ పరారీలో ఉన్న దొంగ పెళ్లికూతురు శీతల్ రాథోడ్‌ను ఎట్టకేలకు వడోదరలోని పానిగేట్ పోలీసులు పట్టుకున్నారు.

ఈజీ మనీ కోసం యువతి పెళ్లిని ఆదాయ వనరుగా మార్చుకుంది. దీంతో యువకులకు గేలం వేసి.. పెళ్లి చేసుకుని అనంతరం డబ్బు దోచుకుని పారిపోయేది. ఈ నేపథ్యంలో గతేడాది సూరత్‌కు చెందిన వజ్రాలకు సానపెట్టె ఓ యువకుడిని శీతల్‌ రాథోడ్‌ పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కొంత కాలం అత్తమామలతో.. ఇంట్లోవాళ్లతో మంచిగానే మసులుకుంది. ఇలా ఉంటుండగా శీతల్ రాథోడ్‌ మధ్యవర్తుల ద్వారా తన భర్త నుంచీ రూ.1.30 లక్షలు తీసుకుంది. అనంతరం ఇంటి నుంచి పారిపోయింది. ఇక తన భార్య ఆచూకీ కోసం ఆ యువకుడు ఎంత మందిని వాకబు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌ వచ్చేది. దీంతో ఆ యువకుడికి తన భార్యపై అనుమానం వచ్చింది. తాను మోసపోయానని బాధిత యువకుడు తెలుసుకుని వెంటనే వధువుపై కతరగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడాది నుంచీ వెదుకుతూనే ఉన్నారు. ఇంతలో వడోదరలోని పానిగేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి దొంగ వధువు శీతల్ రాథోడ్‌ వడోదరలో ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా వడోదర పోలీసులు నిందితురాలిని గుర్తించారు. అనంతరం వడోదర పోలీసులు దొంగ పెళ్లికూతురును అదుపులో తీసుకుని సూరత్ పోలీసులకు అప్పగించారు. శీతల్‌ రాథోడ్‌ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుని డబ్బులు, నగలతో మాయం అవుతుందని.. రకరకాల పేర్లతో యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తూ నగదుతో పరారయ్యేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-05-24T14:33:18+05:30 IST