ఆ రెండు నగరాల్లో గర్భనిరోధక మాత్రలపై నిషేధాస్త్రం...ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-02-20T12:11:36+05:30 IST

అప్ఘానిస్థాన్ దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో గర్భనిరోధక మాత్రల(Contraception)అమ్మకాలను తాలిబాన్లు నిషేధించారు....

ఆ రెండు నగరాల్లో గర్భనిరోధక మాత్రలపై నిషేధాస్త్రం...ఎందుకంటే...
Taliban Bans Contraception

కాబూల్ (ఆఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్తాన్‌ దేశంలో తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.(Taliban bans)అప్ఘానిస్థాన్ దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో గర్భనిరోధక మాత్రల(Contraception) అమ్మకాలను తాలిబాన్లు నిషేధించారు. అప్ఘాన్ దేశంలో(Afghanistan) ముస్లిం జనాభాను నియంత్రించడానికి(Control Muslim population) గర్భనిరోధక మాత్రలతో పాశ్చాత్య దేశాలు కుట్ర పన్నాయని పేర్కొంటూ తాలిబన్లు రెండు నగరాల్లో గర్భనిరోధక మాత్రలను నిషేధించారు.

అఫ్ఘాన్ నుంచి యూఎస్ దళాల ఉపసంహరణ తర్వాత 2021 ఆగస్టు నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల హక్కులపై తాలిబన్లు చేసిన తాజా దాడి ఇది.2021 వ సంవత్సరం నుంచి చాలా మంది అఫ్ఘాన్ మహిళలకు ప్రసూతి గురించి ప్రాథమిక సమాచారం అందుబాటులో లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో వెల్లడించింది. తాలిబన్లు ఇంటింటికీ వచ్చి గర్భనిరోధక మందులు, కండోమ్‌లు విక్రయించవద్దని తమను బెదిరిస్తున్నారని మంత్రసానులు చెప్పారు.

ఇది కూడా చదవండి : PM Narendra Modi: మేఘాలయలో సీఎం సంచలన నిర్ణయం... ప్రధాని మోదీ సభకు అనుమతి నిరాకరణ

‘‘తాలిబన్లు రెండుసార్లు తుపాకులతో నా దుకాణానికి వచ్చారు, గర్భనిరోధక మాత్రలు అమ్మకానికి ఉంచవద్దని నన్ను బెదిరించారు. వారు కాబూల్‌లోని ప్రతి ఫార్మసీని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు,దీంతో మేం గర్భనిరోధక ఉత్పత్తులను అమ్మడం నిలిపివేశాం’’అని స్టోర్ యజమాని చెప్పారు.‘‘ఈ నెల ప్రారంభం నుంచి గర్భనిరోధక మాత్రలు, డెపో-ప్రోవెరా ఇంజెక్షన్లు వంటి వస్తువులను ఫార్మసీలో ఉంచడానికి అనుమతించం’’ అని కాబూల్‌లోని మరో దుకాణ యజమాని చెప్పారు.

ఇది కూడా చదవండి : Two Wives Fight: ఇద్దరు భార్యల మధ్య రాజుకున్న గొడవ కాల్పులకు దారితీసింది...చివరికి భర్తకు ఏమైందంటే...

గతంలో తాలిబన్లు మహిళల కోసం విశ్వవిద్యాలయాలను మూసివేసింది, మహిళలను వారి ఉద్యోగాలను వదిలివేయమని బలవంతం చేసింది. కాగా కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక మాత్రలను పొందడం ప్రాథమిక హక్కు అని సామాజిక కార్యకర్త షబ్నం నసిమి చెప్పారు. అఫ్ఘాన్ మహిళలు కోరుకున్న దానికంటే ఎక్కువ మంది పిల్లలున్నారు.

Updated Date - 2023-02-20T12:32:35+05:30 IST