Table Fan Cooler: ఎండలకు తట్టుకోలేక వెరైటీ ప్లాన్.. టేబుల్ ఫ్యాన్‌ను సింపుల్ ట్రిక్స్‌తో కూలర్‌గా మార్చేశాడు..!

ABN , First Publish Date - 2023-05-18T17:46:02+05:30 IST

అవసరం ఏదో ఒకటి చేయిస్తుంది అంటారు కదా. ఇతని విషయంలోనూ అలాగే జరిగింది. ఎండలకు తట్టుకోలేక ఓ వ్యక్తి వెరైటీగా ఆలోచించాడు. తన దగ్గరున్న టేబుల్ ఫ్యాన్ ను సింపుల్ ట్రిక్స్ తో కూలర్ గా మార్చేశాడు.

Table Fan Cooler: ఎండలకు తట్టుకోలేక వెరైటీ ప్లాన్.. టేబుల్ ఫ్యాన్‌ను సింపుల్ ట్రిక్స్‌తో కూలర్‌గా మార్చేశాడు..!

ఏడుకేడు ఎండల ధాటి పెరిగిపోతోంది. ఇంట్లో ఉన్నా వంటగదిలో పొయ్యి ముందు ఉన్నట్టు సెగ కొడుతుంది. ఎక్కడ చూసినా వాతావరణ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైమాటే నమోదవుతోంది. దీంతో చాలా ఇళ్ళలో 24గంటలూ కూలర్లు, ఏసీలు పనిచేస్తూనే ఉంటున్నాయి. కూలర్లు, ఏసీలు లేనివారి బాధ దేవుడికే ఎరుక. అయితే అవసరం ఏదో ఒకటి చేయిస్తుంది అంటారు కదా. ఇతని విషయంలోనూ అలాగే జరిగింది. ఎండలకు తట్టుకోలేక ఓ వ్యక్తి వెరైటీగా ఆలోచించాడు. తన దగ్గరున్న టేబుల్ ఫ్యాన్(Table fan) ను సింపుల్ ట్రిక్స్ తో కూలర్(cooler) గా మార్చేశాడు. ఈ ఔట్పుట్ చూసి నెటిజన్ల దిమ్మతిరిగిపోతోంది. 'ఇండియన్స్ ట్యాలెంట్ ను కొట్టేవాళ్లు లేరు' అంటున్నారు. ఇంతకూ టేబుల్ ఫ్యాన్ తో అతను చేసిన మ్యాజిక్ ఏంటో..ఎలా చేశాడో పూర్తీగా తెలుసుకుంటే..

ఆర్థిక పరిస్థితి(commercial status) బాగున్నవాళ్ళు తాము కావాలనుకున్నది ఏదైనా కొనేస్తారు. కానీ ఆర్థిక పరిస్థితి బాలేనివారు ప్రతిరూపాయి చూసుకుని ఖర్చుపెట్టుకుంటారు. ఎండల ధాటికి చాలామంది ఏసీలు, కూలర్లు కొని భానుడి ప్రతాపం నుండి ఊరట చెందుతున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి బాలేని ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు(think different). అతను తన దగ్గరున్న టేబుల్ ఫ్యాన్ ను కూలర్ గా(table fan turn to cooler) మార్చేశాడు. ఇందుకోసం అతను ఉపయోగించిన వస్తువులు టేబుల్ ఫ్యాన్(Table fan), ప్లాస్టిక్ స్టూల్(Plastic stool), గోనె సంచిపట్టలు(ginny bags), రెండు లీటర్ల ప్లాస్టిక్ బాటిల్(plastic bottle), ఓ సెలైన్ డ్రిప్ సెట్(drip set). ఓ చెక్క పలక(wooden board). టేబుల్ ఫ్యాన్ ను ప్లాస్టిక్ స్టూల్ లోపల పెట్టాడు. స్టూల్ పైన చెక్క పలక ఉంచాడు. దీంతో అది అచ్చు కూలర్ లా కనిపిస్తోంది. దీనికి చుట్టూ గోనె సంచిపట్టలు చుట్టాడు. పైన చెక్క పలక మీద రెండులీటర్ల ఖాళీ మాజా బాటిల్ ఉంచి దాంట్లో నీళ్ళు నింపాడు. దానికి సెలైన్ డ్రిప్ సెట్ చేసి గోనె సంచులకు వాటర్ సప్లై అయ్యేలా చేశాడు. దీనివల్ల సంచులు తడిగా మారుతున్నాయి. టేబుల్ ఫ్యాన్ గాలి ఈ సంచుల కారణంగా చాలా చల్లగా వస్తోంది. దీంతో వేలకు వేలకు పోసి కొనక్కర్లేకుండా కూలర్ తయారైపోయింది.

fan.gif

ఈ కూలర్ ఫోటోను WeBankers అనే ఫేస్ బుక్ పేజీలో(Facebook page) షేర్ చేశారు. Dekh rahe ho Binod! అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్ల దిమ్మతిరిగిపోతోంది. 'ఇంత ట్యాలెంటెండ్ గా ఉన్నారేంటి?' అంటున్నారు. 'ఇండియన్స్ ట్యాలెంట్ ను కొట్టేవాళ్ళు ఎవరూ లేరు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'ఇది నిజంగా చాలా బాగుంది, పైనున్న వాటర్ బాటల్ కెపాసిటీని పెంచండి ఇంకా బాగుంటుంది' అని అంటున్నారు.

Health Tips ముఖంపై మొటిమలు అస్సలు తగ్గడం లేదా..? ఎన్ని క్రీములను వాడినా ఫలితం లేదా..? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌ను పాటిస్తే..!


Updated Date - 2023-05-18T20:01:46+05:30 IST