Health Tips ముఖంపై మొటిమలు అస్సలు తగ్గడం లేదా..? ఎన్ని క్రీములను వాడినా ఫలితం లేదా..? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌ను పాటిస్తే..!

ABN , First Publish Date - 2023-05-18T15:59:42+05:30 IST

మొటిమల ఇబ్బంది పడనివారంటూ ఉండరు, అలాగే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయని వారు ఉండరు. ఎన్ని చేసినా ఫలితం లేకుంటే ఇదిగో ఈ టిప్స్ భలే మ్యాజిక్ చేస్తాయి..

Health Tips ముఖంపై మొటిమలు అస్సలు తగ్గడం లేదా..? ఎన్ని క్రీములను వాడినా ఫలితం లేదా..? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌ను పాటిస్తే..!

ముఖ సౌందర్యాన్ని పాడుచేయడంలోమొటిమల(pimples) పాత్ర చాలా పెద్దది. ముఖాన్ని ఎంత డ్యామినేట్ చెయ్యాలో అంతా చేస్తాయి. నేటి కాలం యువతీ యువకులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో(summer) ఈ సమస్య మరీ అధికం. రాత్రి పడుకునేముందు వరకు బానే ఉన్నా లేచేసరికి ముఖం మీద ఉబ్బిపోయి వెక్కిరిస్తూ కనిపిస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నెన్నో టిప్స్ ఫాలో అవుతుంటారు, మరెన్నో క్రీములు అప్లై చేస్తుంటారు. కానీ అవి తగ్గకపోగా మరింత పెరుగుతాయి. 'ఈ మొటిమలు ఇక తగ్గవా.. ఈ ముఖం ఇంతేనా..' అని దిగులు పడక్కర్లేదిప్పుడు. ముఖం మీద మొటిమలు పోగొట్టే సింపుల్ చిట్కాలు(simple tips to remove pimples) ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చాలు మచ్చల గుర్తులు కూడా లేకుండా మొటిమలు మాయం అవుతాయి. ఇందుకోసం డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే.. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

పసుపు, అల్లం..(turmeric, ginger)

ముఖం మీద మొటిమలను తొలగించడానికి పసుపు, అల్లం అద్బుతంగా పనిచేస్తాయి. ఇవి రెండూ మంచి యాంటీ బయాటిక్స్ ఏజెంట్స్(Anti biotic agents) అని అందరికీ తెలిసిందే. టేబుల్ స్పూన్ పసుపులో అరస్పూన్ అల్లం తురుము లేదా అల్లం రసం వేసి పేస్ట్ లా చేయాలి. కావలసి వస్తే అందులో కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ ను మొటిమల మీద అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

వెల్లుల్లి..(garlic)

వెల్లుల్లి మొటిమలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు(anti bacterial) పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని దంచి ఆ పేస్ట్ ను మొటిమల మీద ఉంచాలి. 10 నుండి 15 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయాలి. వెల్లుల్లిలో ఉండే వేడి మొటిమ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తొందరగా మొటిమలు మానిపోయేలా చేస్తుంది. మొటిమలో బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అయితే సున్నితమైన చర్మం(sensitive skin) ఉన్నవారు వెల్లులిని వాడకపోవడమే మంచిది.

Viral News: ఈ టీ షాప్ ఓనర్ తెలివి మామూలుగా లేదుగా.. ఛాయ్ షాప్‌నకు అతడు పెట్టిన పేరుపై నెట్టింట హాట్ టాపిక్..!


తేనె, దాల్చిన చెక్క..(honey, cinnamon)

తేనె, దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు(anti oxidant) సమృద్దిగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ రెండింటిని కలిపి ఉపయోగించడం వల్ల మొటిమలలో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దీన్ని మొటిమలు, మచ్చల మీద అప్లై చెయ్యాలి. 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తుంటే మొటిమలు, మచ్చలు కూడా తొందరగా తగ్గిపోతాయి.

దోసకాయ..(cucumber)

దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయను తురిమి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ లో అరస్పూన్ పంచదార(sugar) కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఈ టిప్ వల్ల ముఖ చర్మం శుభ్రపడుతుంది. ముఖం మీద మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి. చర్మం చల్లబడటం వల్ల మొటిమల ప్రభావం తగ్గుతుంది.

కొబ్బరినూనె..(coconut oil)

కొబ్బరినూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలు తగ్గిచడంలో సహాయపడుతుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ నిజంగానే అద్బుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెను ముఖానికి అప్లై చేస్తూంటే మొటిమలు రావు. వచ్చిన మొటిమలు కూాడా తొందరగా తగ్గిపోతాయి

Viral Video: అమ్మాయిలూ.. బీ అలెర్ట్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారా..? ఈ యువతికి ఏం జరిగిందో చూస్తే..!


Updated Date - 2023-05-18T16:22:04+05:30 IST