#Thalaivar170: వినూత్న దర్శకుడితో రజనీకాంత్ కొత్త సినిమా.. క్రేజీ కాంబో అంటూ..

ABN , First Publish Date - 2023-03-02T12:24:17+05:30 IST

దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Superstar Rajinikanth)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

#Thalaivar170: వినూత్న దర్శకుడితో రజనీకాంత్ కొత్త సినిమా.. క్రేజీ కాంబో అంటూ..
Rajinikanth

దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Superstar Rajinikanth)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంక చెప్పాలంటే.. ఆయనకి జపాన్ వంటి ఇతర దేశాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ సినిమా గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే 72 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకి ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ (Jailer) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అది ఆయన 169వ సినిమా. ఆ చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతలోనే రజనీ చేయబోయే మరో చిత్రం గురించి ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రజనీ 170 సినిమాని తమ బ్యానర్‌లో చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్‌ (Lyca Productions) ప్రకటించింది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ (Jai Bheem) మూవీతో వినూత్న దర్శకుడి విమర్శకుల ప్రశంలసు అందుకున్న టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) డైరెక్షన్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ లైకా ప్రొడక్షన్స్ ఓ ట్వీట్‌ని పోస్ట్ చేసింది. అందులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనకి సంబంధించిన పిక్‌ని షేర్ చేసింది. దానికి.. ‘సూపర్ స్టార్‌తో మేము కలిసి పని చేయనునట్లు ప్రకటించడం మాకు గౌరవంగా భావిస్తున్నాం. తలైవర్ 170కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తాడు. రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తాడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

లైకా ప్రొడక్షన్స్ ఛైర్మన్ సుభాస్కరన్ గురువారం (మార్చి 2న) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగానే రజనీతో కొత్త సినిమా ప్రకటన చేసింది లైకా ప్రొడక్షన్స్. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. దీంతో రజనీ, జ్ఞానవేల్, అనిరుధ్ ఈ క్రేజీ కాంబోతో అద్భుతం జరగుతుందంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-02T12:24:24+05:30 IST