RRR: వైరల్ వీడియో.. ‘నాటు నాటు’ కు స్టెప్పులేసిన కొరియన్ ఎంబసీ సిబ్బంది..

ABN , First Publish Date - 2023-02-26T17:11:30+05:30 IST

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

RRR: వైరల్ వీడియో..  ‘నాటు నాటు’ కు స్టెప్పులేసిన కొరియన్ ఎంబసీ సిబ్బంది..

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కు అందరు ఫిదా అయ్యారు. తాజాగా ఈ ఫీవర్ ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీని తాకింది. ఎంబసీలోని సిబ్బంది అంతా ‘నాటు నాటు’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీ సిబ్బంది ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు. తమ డ్యాన్స్‌తో నెటిజన్స్‌ను మెస్మరైజ్ చేశారు. సిబ్బందితో కలసి దౌత్యవేత్త చాంగ్ జే బోక్ (Chang Jae-bok) కూడా కాలు కదిపారు. ఈ వీడియో దాదాపుగా 53సెకన్స్ ఉంది. కొరియన్ ఎంబసీ ఇన్ ఇండియా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘కొరియన్ ఎంబసీ ‘నాటు నాటు’ డ్యాన్స్ కవర్‌ను మీతో పంచుకోవడానికి మేం సంతోషిస్తున్నాం. ఎంబసీ సిబ్బందితో కలసి కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బోక్ కూడా ‘నాటు నాటు’ కు కాలు కదిపారు’’ అని కొరియన్ ఎంబసీ ఇన్ ఇండియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపుగా 2లక్షల మంది వీడియోను వీక్షించారు. ఈ వైరల్ వీడియోపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. అద్భుతమైన ప్రయత్నంగా పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే పాకిస్తానీ నటి హనియా ఆమిర్‌ (Hania Aamir) ఓ పెళ్లిలో ఇదే పాటకు స్టెప్పులేశారు. ‘నాటు నాటు’ సాంగ్ హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ కు హుక్ డ్యాన్స్ చేసి ఫంక్షన్‌కు వచ్చిన అతిథులను ఫిదా చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ నామినేషన్‌ను కూడా ఈ మూవీ సాధించింది. ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డ్ కోసం పోటీపడుతుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-26T17:12:19+05:30 IST