Sleeping Mistakes: మీరు కూడా ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారా..? పొరపాటున కూడా ఇలా పడుకోవద్దు..!

ABN , First Publish Date - 2023-08-23T15:32:57+05:30 IST

నిద్రను గొప్ప ఔషదంగా అభివర్ణిస్తారు. ఆరోగ్యకరమైన నిద్ర శరీర ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడామెరుగుపరుస్తుంది. అయితే రాత్రి పడుకునేముందు చాలామంది తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు.

Sleeping Mistakes: మీరు కూడా ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారా..? పొరపాటున కూడా ఇలా పడుకోవద్దు..!

నిద్రను గొప్ప ఔషదంగా అభివర్ణిస్తారు. ఆరోగ్యకరమైన నిద్ర శరీర ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడామెరుగుపరుస్తుంది. అయితే రాత్రి పడుకునేముందు చాలామంది తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనివల్ల మొటిమలు రావడమే కాదు డిప్రెషన్, కలత నిద్ర, చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గాలన్నా ఈ కింది పొరపాట్లు సరిదిద్దుకోవడం ఎంతో అవసరం.

పడుకోవడానికి ప్రతి ఒక్కరూ దిండు(Pillow) ఉపయోగిస్తుంటారు. ఈ దిండు కవర్(pillow cover) లు వారాలు, నెలల తరబడి మార్చకుండా అలాగే ఉపయోగించేవారు చాలామంది ఉంటారు. దిండు కవర్ మార్చకపోతే మొటిమలు వస్తాయి. తలకు నూనె పెట్టుకున్నప్పుడు, ముఖానికి చెమట పట్టినప్పుడు అదంతా దిండుకవర్ లోకి ఇంకిపోయి అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇలాంటి దిండు కవర్ వేసుకుని నిద్రించడం వల్ల ముఖ చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, మృతకణాల పెరుగుదల, ఇన్ఫెక్షన్ ఏర్పడతాయి. వీటికారణంగా మొటిమలు వస్తాయి. శుభ్రం చేయని ఇంకొకరి దిండు కవర్ లు, దిండ్లు ఉపయోగించడం మరింత ప్రమాదం. దీనివల్ల జుట్టుసంబంధం సమస్యలు కూడా సులువుగా వస్తాయి. ప్రతి వారం లేదా 10రోజులకు ఒకసారి దిండుకవర్ మార్చడం లేదా ఉతికి ఉపయోగించడం మంచిది.

నైట్ పార్టీలు, ఉద్యోగాల కారణంగా ఆలస్యంగా ఇంటికి చేరుకునే మహిళలు చేసే పెద్ద మిస్టేక్ ముఖానికి ఉన్న మేకప్ ను సరిగ్గా తొలగించకపోవడం(make up removing mistake). ఇది కూడా ముఖం మీద మొటిమలు రావడానికి కారణం అవుతుంది. మేకప్ సరిగ్గా తొలగించకపోతే మేకప్ లోని రసాయనాలు చర్మరంధ్రాలు మూసుకుపోవడానికి కారణం అవుతాయి. ఇది మొటిమలకు దారితీస్తుంది. పడుకునేముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని లైట్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

China Youth: రూటు మార్చుతున్న చైనా యూత్.. డ్రాగన్ దేశంలో కొత్త ట్రెండ్.. తోడు కోసం పెళ్లి అక్కర్లేదంటూనే నయా ప్లాన్..!వేళకాని వేళలో నిద్రపోవడం శరీరంలో నిద్ర గడియారం అయిన సిర్కాడియన్ రిథమ్ కు భంగం కలిగిస్తుంది. ఇది హార్మోన్ అసమతుల్యతకు కారణం అవుతుంది. చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో హార్మోన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి సమతుల్యం కోల్పోవడం వల్ల మొటిమలు వస్తాయి. చాలామంది వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోతుంటారు. ఇది మంచి పద్దతికాదు. నిద్రాచక్రాన్ని ఎప్పుడూ ఒక పద్దతిలో సాగనివ్వాలి.

ఒక నిర్ణీత సమయానికి నిద్రపోవడం ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన నిద్ర అంతే అవసరం. కలత నిద్ర(sleep upset) కూడా హార్మోన్ సమస్యలకు దారితీస్తుంది. ఇది మానసిక రుగ్మతలు, మొటిమలకు కారణం అవుతుంది. కలత నిద్రపోయి బాగా నిద్రపట్టాలంటే నిద్రించే వాతావరణం బాగుండాలి. అలాగే పగటి సమయంలో శారీరక శ్రమ కూడా బాగుండాలి. లైట్లు వేసుకుని నిద్రపోకూడదు. నిద్రపోయే ముందు శ్వాస వ్యాయామాలు చేయాలి.

చాలామందికి రాత్రిసమయంలో కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. అలాగే ఆకలి పేరుతో నూనెతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. కానీ నిద్రకు ముందు కెఫిన్ పానీయాలు, నూనె ఆహారాలు తీసుకోవడం వల్ల మొటిమలు సులువుగా వస్తాయి. నిద్రకు ముందు ఆకలివేస్తే లైట్ గా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. అలాగే పసుపు పాలు తాగడం కూడా మంచి నిద్రకు ఉపకరిస్తుంది. ఇది మొటిమలు నివారించడంలో సహాయపడుతుంది.

Health Tips: చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? వేసుకుని నడిస్తే మంచిదా..? దేని వల్ల ఎక్కువ లాభమంటే..!


Updated Date - 2023-08-23T15:32:57+05:30 IST