Naga Vamsi: మెయిల్ పెట్టండి.. సినిమాను ఫ్రీగా చూడండి..

ABN , First Publish Date - 2023-03-04T16:36:46+05:30 IST

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ‘వాత్తి’ (Vaathi). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ పాత్రను పోషించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Naga Vamsi: మెయిల్ పెట్టండి.. సినిమాను ఫ్రీగా చూడండి..

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) హీరోగా నటించిన సినిమా ‘వాత్తి’ (Vaathi). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ పాత్రను పోషించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ మూవీ ‘సార్’ (Sir) టైటిల్‌తో తెలుగులోకి డబ్ అయింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను పాఠశాల విద్యార్థులకు ఉచితంగా చూపిస్తామని నిర్మాణ సంస్థ తాజాగా చెప్పింది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘చదువు విలువను అందరికి తెలియచెప్పడమే సార్ సినిమా ప్రధాన లక్ష్యం. అందుకే ఈ చిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా చూపెట్టాలనుకుంటున్నాం. దయచేసి contact@sitharaents.com కు మెయిల్ చేయండి. మా బృందం మిమ్మల్ని సంప్రదించి వీలైనంత త్వరగా మూవీని చూపెడుతుంది’’ అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ (Naga Vamsi) ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. పిల్లలో దేశభక్తిని పెంపొదించడానికి గతంలో ‘మేజర్’ చిత్రాన్ని ఉచితంగా చూపెట్టిన సంగతి తెలిసిందే.

సార్ సినిమా సంచలన విజయంతో చిత్రబృందం చెన్నైలో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ‘వాత్తి’ బ్లాక్ బాస్టర్ విజయానికి మీడియానే కారణమని వెంకీ అట్లూరి చెప్పారు.‘‘వాత్తి మూవీ విడుదలకు ముందే మీడియాకు ప్రత్యేకంగా షోను వేశాం. ఈ సినిమాను చూసిన వారు మంచి రేటింగ్‌ ఇస్తూ, పాజిటివ్‌ రివ్యూలు రాశారు. ఇదే పాజిటివ్‌ టాక్‌ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ కనిపించింది. ఆ మౌత్‌టాక్‌ మనీగా మారింది. ఫలితంగా ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకుమించి ఇంకేం కావాలి. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన హీరో ధనుష్‌, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని వెంకీ అట్లూరి పేర్కొన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-04T16:36:46+05:30 IST