Share News

Shocking News: ప్లీజ్ సార్.. వద్దు.. అని క్లాస్‌ రూమ్‌లోని పిల్లలంతా వేడుకుంటున్నా కనికరించని టీచర్.. ఆ సినిమాను చూపించి మరీ..!

ABN , First Publish Date - 2023-10-13T09:32:16+05:30 IST

పాపం ఆ పిల్లలు.. తమ టీచర్ సినిమా చూపిస్తానంటే ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ తరువాత సినిమా ఆపమంటూ బతిమాలాల్సి వచ్చింది.

Shocking News: ప్లీజ్ సార్.. వద్దు.. అని క్లాస్‌ రూమ్‌లోని పిల్లలంతా వేడుకుంటున్నా కనికరించని టీచర్.. ఆ సినిమాను చూపించి మరీ..!

కొన్ని పాఠశాలల్లో పిల్లలకు కేవలం సబ్జెక్ట్ కు సంబంధించిన తరగతులే కాకుండా వివిధ రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తారు. వీటిలో క్రీడలు, సంగీతం, డ్యాన్స్, ప్రయోగాలు, ప్రాజెక్టులు, మంచి సినిమాలు చూపించడం, పిల్లలతో ఈవెంట్స్ నిర్వహించడం, ప్రపంచ దేశాలలో వింత గురించి, ఆసక్తి విషయాల గురించి వివరించి చెప్పడం. ఇలా పాఠశాల నిర్వాహణాధికారుల అభిరుచిని బట్టి వివిధ రకాల ఈవెంట్స్ ఫాలో అవుతారు. పిల్లలు కూడా యాక్టివిటీస్ సమయంలో చాలా హుషారుగా ఉంటారు. ఆ స్కూల్ పిల్లలు కూడా తమ టీచర్ సినిమా చూపిస్తాననగానే ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ తరువాత పరిస్థితులు తలకిందులైపోయాయి. ఆ టీచర్ ప్లే చేసిన సినిమా చూసి ఆ పిల్లలు వణికిపోయారు. 'వద్దు సార్.. ఆ సినిమా ఆపేయండి, మేము చూడలేము' అని ఎంత వేడుకున్నా వినలేదు. చివరికి ఆ సినిమా కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం విన్న నెటిజన్లు ఆ టీచర్ మీద మండిపడుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అమెరికా(America) సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన ఫ్లోరిడా(florida)లో ఒక టీచర్ వింత సరదా పిల్లలను వణికిపోయేలా చేసింది. పాఠశాలలో పిల్లలకు అన్ని విషయాల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వివిధ రకాల ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు(maths teacher) 'విన్నీ ది పూ: బ్లడ్ అండ్ హనీ'(Winnie the pooh: blood and honey) అనే హర్రర్ సినిమా(horror movie)ను తరగతిలో ప్లే చేశాడు. పాపం.. తమ ఉపాధ్యాయుడు మంచి సినిమా చూపిస్తాడని ఎంతో హుషారుగా సినిమా చూడటానికి సిద్దమైన ఆ పిల్లలు సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అది హర్రర్ సినిమా అని అర్థమై సినిమా ఆపేయమని కోరారు. కానీ ఆ ఉపాధ్యాయుడు మాత్రం సినిమా ఆపడానికి నిరాకరించాడు. బలవంతంగా పిల్లలకు ఆ సినిమా చూపించాడు.

Dry Fruits: వేయించిన డ్రై ఫ్రూట్స్ తింటుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలుసా?



సినిమా మొత్తం పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న పిల్లలను ఆ సినిమా ప్రభావం వదల్లేదు. ఆ సినిమాలో పలు భయానక సన్నివేశాలు, పాత్రలు ఉండటంతో పిల్లల మానసిక స్థితి దెబ్బతింది. పిల్లల ప్రవర్తన వింతగా ఉండటంతో తల్లిదండ్రులు పిల్లలను ఆరా తీశారు. పిల్లలు ఏడుస్తూ తమ టీచర్ చేసిన నిర్వాకం గురించి చెప్పగా ఒకవైపు టీచర్ మీద కోపం, మరొకవైపు తమ పిల్లల మానసిక స్థితి ఇలా అయ్యిందన్న బాధ పిల్లల తల్లిదండ్రులలో కలిగాయి. అందరూ పాఠశాలకు చేరుకుని పిల్లల పరిస్థితి వివరించి సదరు టీచర్ మీద ఫిర్యాదు చేశారు. విషయం విన్న పాఠశాల నిర్వాహకులు ఆ సినిమా పిల్లలకోసం ఉద్దేశించినది కాదని, ఆ టీచర్ తప్పు చేశాడని చెప్పుకొచ్చారు. టీచర్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రలకు చెప్పారు.

Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..


Updated Date - 2023-10-13T09:32:16+05:30 IST