Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..

ABN , First Publish Date - 2023-10-12T12:40:47+05:30 IST

ప్రాంతీయతను బట్టీ బోలెడు పేమస్ స్వీట్లున్నాయి.. కానీ ఈ ఆగ్రా స్వీట్ తయారీ వేరే లెవల్. చూస్తే డంగైపోతారు..

 Viral Video: స్వీట్లంటే ఇష్టమా?  ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..

స్వీట్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. తియ్యగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ మధురమైన అనుభూతిని కలిగిస్తాయి స్వీట్లు. ఈ స్వీట్లలో బోలెడు రకాలున్నాయి. వాటికి ప్రాంతీయ గుర్తింపుతో పాటూ ఓ మోస్తరు చరిత్ర కూడా ఉంటుంది. బందరు లడ్డూ, కరాచీ హల్వా, హర్యానా జిలేబీ, ఆంధ్రా బొబ్బట్లు ఇలా ఒకో ప్రాంతంలో ఒక్కోటి ఫేసమ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆగ్రా ఫేమస్ స్వీట్ అయిన పేటాను తయారుచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకంటే..

ప్రాంతీయతతో ఫేమస్ అయిన ఆహారపదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆగ్రా(Agra) ఫేమస్ స్వీట్ పేతా(Agra Famous Sweet petha) కూడా ఒకటి. పేతాను బూడిద గుమ్మడికాయతో(Ash gourd) తయారుచేస్తారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. కానీ దీన్ని తయారుచేస్తున్న తీరు ఇప్పుడు పెద్ద షాకే ఇస్తోంది. వీడియోలో బూడిద గుమ్మడి కాయలు తరగడం నుండి దాన్ని స్వీట్ గా మార్చడం వరకు వివిధ దశలు ఉన్నాయి. మొదట బూడిద గుమ్మడికాయలు కట్ చేసి చెక్కు తీస్తారు. ఆ తరువాత మెషీన్ సహాయంతో వాటిలో విత్తనాలు తొలగిస్తారు. వాటిని చతురస్రాకారంలో మందంగా ముక్కలు చేస్తారు. వీటిని పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో బాగా కడుగుతారు. ఇక్కడ విస్తుపోయే విషయం ఏమింటంటే.. ఈ ముక్కలు నీళ్లలో కుడుగుతూ అక్కడ పనివారు అదే నీళ్ళతో, గుమ్మడి ముక్కలు ఉన్న పాత్రలోనే ముఖాన్ని, చేతులను కడుక్కోవడం. ఆ తరువాత ఆ గుమ్మడి ముక్కలను ఉడికించి, చక్కెర సిరప్ లో వేసి కాసేపయ్యాక అందులో నుండి ముక్కలు వేరు చేస్తారు. ఇలా పేతా తయారుచేశారు. దీని తయారీలో అస్సలు పరిశుభ్రత లేకపోవడం అందరికీ కంగారు పుట్టిస్తోంది.

Treadmill vs Walking: ట్రెడ్‌మిల్ వాకింగ్ మంచిదా? లేక బయట నడవడం మంచిదా? బరువు తగ్గడానికి ఏది బెస్టంటే..



ఈ వీడియోను theyummymania అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. 'అసలు అతను అలా ఎలా చేస్తున్నాడు? నేను నమ్మలేకపోతున్నాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'బ్రదర్ కేవలం ముఖం మాత్రమేనా స్నానం చెయ్యవా? ఇదిగో ఈ సబ్బు తీసుకో' అని మరొకరు కామెంట్ చేశారు.'మొత్తానికి మురికి ఫ్లేవర్ తో కూడిన పేతా అన్నమాట' అని ఇంకొకరరు అన్నారు. పేతా అంటే ఇష్టమున్న ఎంతోమంది ఈ వీడియో చూసిన తరువాత దాని పేరు చెబితే భయపడుతున్నారు.

Home Tips: పాత దుస్తులను పారేస్తున్నారా..? అయితే మీరు ఈ 7 విషయాలనూ తెలుసుకోవాల్సిందే..!


Updated Date - 2023-10-12T12:40:47+05:30 IST