Shocking: 10 రోజులుగా బాత్రూంకు వెళ్లలేదో వ్యక్తి.. తీవ్రమైన ఛాతినొప్పితో ఆస్పత్రికి.. డాక్టర్లే నివ్వెరపోయిన పరిస్థితి.. చివరకు..!

ABN , First Publish Date - 2023-09-25T16:51:43+05:30 IST

రోజూ మూడు పూటలా ఆహారం తీసుకున్నట్టు కనీసం రోజులో ఒకసారి అయినా మలవిసర్జనకు వెళ్లడం అనేది కామన్. కానీ ఇతను మాత్రం 10రోజులుగా బాత్రూమ్ కు వెళ్లలేదు. ఫలితంగా ఎలా చనిపోయాడంటే..

Shocking: 10 రోజులుగా బాత్రూంకు వెళ్లలేదో వ్యక్తి.. తీవ్రమైన ఛాతినొప్పితో ఆస్పత్రికి.. డాక్టర్లే నివ్వెరపోయిన పరిస్థితి.. చివరకు..!

ప్రతిరోజూ తీసుకునే ఆహారం, పానీయాలలో వ్యర్థాలు అన్నీ మలం, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. రోజూ మూడు పూటలా ఆహారం తీసుకున్నట్టు కనీసం రోజులో ఒకసారి అయినా మలవిసర్జనకు వెళ్లడం అనేది కామన్. మలవిసర్జన సాఫీగా జరిగిపోతే శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. కానీ 65ఏళ్ల ఓ వ్యక్తికి ఏకంగా 10రోజులపాటు మలవిసర్జన జరగలేదు. దీంతో అతను తీవ్రమైన ఛాతీనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాడు. అతని సమస్య చెప్పి, దానికి పరిష్కారం కోసం డాక్టర్లను అతను అభ్యర్థించిన విషయానికి డాక్టర్లే షాకయ్యారు. చివరకు ఏం జరిగిందో తెలుసుకున్నాక చాలామంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది ఆందోళన పడుతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

65ఏళ్ల(65years old man) వయసు కలిగిన ఒక సీనియర్ సిటిజన్ 10రోజులుగా మలవిసర్జన జరగడం లేదంటూ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతన్ని పరీక్షించి అది మలబద్దకం(constipation) సమస్యగా గుర్తించారు. అతను ఛాతీ నొప్పి నుండి కోలుకునేలానూ, కూర్చోవడం, లేవడం, తిరగడం వంటి పనులు చెయ్యడానికి వీలుగా కొన్ని మందులు సిఫారసు చేశాడు. అవి వాడుతూ ఉంటే మలబద్దకం సమస్య దానికదే తొలగిపోతుందని కూడా చెప్పారు. కానీ ఆ రోగి మాత్రం తనకు మలబద్దకం వల్ల శరీరంలోపల చాలా కష్టంగా ఉందని, దాన్ని వెంటనే పరిష్కరించడానికి ఎనిమా(enema) ఇవ్వమని అభ్యర్థించాడు. సాధారణంగా ఎనిమా ఊపిరితిత్తులు, గుండె మీద దుష్ఫ్రభావాలు తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. అతని అభ్యర్థనను అనుసరించి చికిత్స ఇవ్వడానికి ముందు వైద్యులు అతని పూర్తీ ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అతనికి అంతకు ముందే గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని తెలియడంతో అతనికి ఎనిమా ఇవ్వడం ప్రమాదమని అది ఇవ్వడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పారు.

Viral News: ఒకప్పుడు రోజుకు రూ.35 సంపాదించిన ఈ వ్యక్తికే.. ఇప్పుడు లక్షల్లో ఆదాయం.. ఇంతకీ ఇతడేం చేస్తున్నాడంటే..!


డాక్టర్లు ఎనిమా ఇవ్వడం కుదరదని చెప్పినా తన సమస్య కారణంగా ఆ వ్యక్తి వైద్యులను బలవంతం చేశాడు. ఎనిమా వల్ల కడుపులో పేరుకుపోయిన మలం బయటకు వచ్చేస్తుందని దానివల్ల తనకు ఉపశమనం కలుగుతుందని అతను అభిప్రాయపడ్డాడు. అయితే ఎనిమా ఇచ్చిన తరువాత బలవంతంగా మలాన్ని బయటకు రప్పించే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి గుండె ఆగి మరణించాడు. ఎనిమా ప్రక్రియలో వాగస్ నాడి ఉత్తేజం చెందిందని అకస్మాత్తుగా అది ఉత్తేజం కావడంతో రక్తపోటు ఉన్నట్టుండి పడిపోయిందని వైద్యులు తెలిపారు. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు మలబద్దకం చికిత్సలో ఎట్టిపరిస్థితులలో ఎనిమా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. మలబద్దకం, హృదయనాళ కారకాలతో ముడి పడి ఉంటుంది. మల విసర్జన సమయంలో ఒత్తిడి చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ మలబద్దకం రాకుండా చూసుకోవాలి. తద్వారా గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించినట్టు అవుతుంది. సరిపడినంత నీరు, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం, నడక, వ్యాయామం వంటివి తప్పనిసరిగా ఫాలో అవ్వాలని సూచించారు.

High Cholesterol Signs: సైలెంట్ కిల్లర్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చెవుల వద్ద సంకేతాలు..!


Updated Date - 2023-09-25T16:51:43+05:30 IST