Viral News: ఒకప్పుడు రోజుకు రూ.35 సంపాదించిన ఈ వ్యక్తికే.. ఇప్పుడు లక్షల్లో ఆదాయం.. ఇంతకీ ఇతడేం చేస్తున్నాడంటే..!

ABN , First Publish Date - 2023-09-25T12:46:19+05:30 IST

కేవలం 5వ తరగతి చదివి, ఏ పనిలోనూ సరైన ఆదాయం లేక రోజుకు రూ. 35 కు పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా లక్షలు సంపాదిస్తున్నాడు.

Viral News: ఒకప్పుడు రోజుకు రూ.35 సంపాదించిన ఈ వ్యక్తికే.. ఇప్పుడు లక్షల్లో ఆదాయం.. ఇంతకీ ఇతడేం చేస్తున్నాడంటే..!

ఈ ప్రపంచంలో మనిషి ఏ ఉద్యోగం చేసినా డబ్బు సంపాదించడం కోసమే చేస్తాడు. ఏ చిన్న అవసరానికైనా డబ్బు ఉండాల్సిందే. కొందరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు, మరికొందరు అంత కష్టపడకుండానే సంపాదిస్తారు. డబ్బు సంపాదించడానికి సరైన మార్గం తెలిసేవరకు అంతా కష్టంగా అనిపిస్తుంది, కానీ సరైన మార్గం తెలిశాక డబ్బు గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కేవలం 5వ తరగతి చదివి, ఏ పనిలోనూ సరైన ఆదాయం లేక రోజుకు రూ. 35 కు పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా లక్షలు సంపాదిస్తున్నాడు. అతను అన్ని సమయాల్లోనూ కష్టపడే పనిచేశాడు. కానీ అతని ఆలోచనే అతని జీవితాన్ని మార్చేసింది. ఇతని సక్సెస్ స్టోరీ తెలుసుకుంటే..

బీహార్(Bihar) రాష్ట్రం, సీతామర్హి జిల్లా దుమ్రా బ్లాక్ ప్రాంతంలో విశ్వనాథ్ భగత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ఇతను తాపీ మేస్త్రీగా పనిచేశాడు. ఆ సమయంలో అతని సంపాదన రూ 35. అది అతనికి తినడానికి, వసతికే సరిపోయేది కాదు. మూడు నెలలపాటు పనిచేసినా అతను సంపాదించి వెనకేసిన డబ్బు కేవలం రూ. 50 మాత్రమే. దీంతో అతను ఆ పని ఇక వద్దనుకుని ఇంటికి చేరుకున్నాడు. దీని తరువాత ఉత్తరప్రదేశ్ లో ఒక ఇటుకబట్టీలో పనికి వెళ్లాడు. అక్కడ కూడా మూడేళ్ళపాటు పనిచేశాడు. అక్కడా అతనికి ఏమీ మిగల్లేదు. దీని తరువాత పంజాబ్ కు వరికోత సమయంలో పనికి వెళ్ళాడు, దాని తరువాత ఢిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేశాడు. ముంబై నగరంలోనూ కష్టపడ్డాడు. ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎంత కష్టపడినా మంచి సంపాదన లేదు, పోగేయడానికి అమీ మిగలలేదు. దీంతో అతను తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి దగ్గరే డబ్బు సంపాదించే ఉపాయం కోసం ఆలోచించాడు. ఈ క్రమంలోనే కూరగాయలు సాగు(vegetable farming) చెయ్యాలని ఆలోచన వచ్చింది.

Hair oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే భృంగరాజ్ నూనెను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితాలు చూసి మీరే షాకవుతారు!!


విశ్వనాథ్ భగత్ ఉంటున్న ప్రాంతంలో అతనికి సొంత భూమి ఉంది కానీ అది కూరగాయల సాగుకు అస్సలు పనికిరాదని తెలిసింది. దీంతో కొంత భూమిని కౌలుకును తీసుకుని అందులో కూరగాయల సాగు ప్రారంభించాడు. 75శాతం సేంద్రీయ ఎరువు, 25శాతం రసాయన ఎరువులు కలిపి పంటకు ఉపయోగించాడు. యూరియా కాకుండా కాల్షియం ఇచ్చేవాడు. రసాయనాలు అస్సలు వినియోగించడు. సంవత్సరానికి సుమారు 30-40 బస్తాల ఆవు పేడ, 40-50 బస్తాల కంపోస్టు ఎరువును పొలానికి ఉపయోగించాడు. పూర్తీ ఆర్గానిక్ పద్దతిలో పండిచడం వల్ల పంట దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం ఇతను దొండకాయ సాగు చేస్తున్నాడు. ప్రతిరోజూ రెండు క్వింటాళ్ల దొండకాయల కోత ఉంటోంది. దీని ధర 6వేల రూపాయలు. 7నెలలపాటు వీటికి ఇలా ఆదాయం వస్తూనే ఉంటుందని విశ్వనాథ్ భగత్ చెప్పుకొచ్చారు.

విశ్వనాథ్ భగత్ ఆదాయం ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. ప్రతి సంవత్సరం 7నుండి 10లక్షల ఆదాయం వస్తోంది. తన పంటను నేరుగా వ్యాపారులకు అమ్మడమే కాకుండా తను కూడా కొన్ని కూరగాయలను తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతుంటారు. ఈ కూరగాయల పంట ద్వారా వచ్చిన ఆదాయంతో మరికొంత భూమి కొన్నాడు, కూతుళ్లక పెళ్లి చేశాడు. తమ్ముడి చేత స్టూడియో పెట్టించి అతన్ని సినిమా రంగంలో సెటిల్ చేశాడు. ఇలా ఇతను తన జీవితంలో రూ. 35 నుండి లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు.

Auto Driver: ఆటో డ్రైవర్‌ను చూసి అవాక్కవుతున్న ప్రయాణీకులు.. ఆటో ఎక్కిన అందరిదీ అదే పరిస్థితి.. అసలు కథేంటంటే..!


Updated Date - 2023-09-25T12:46:19+05:30 IST