Sara Tendulkar: పఠాన్ మూవీపై సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

ABN , First Publish Date - 2023-01-28T09:51:11+05:30 IST

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టీ సారా టెండూల్కర్ తన స్నేహితురాళ్లతో కలిసి లండన్‌లో...

Sara Tendulkar: పఠాన్ మూవీపై సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
Sara Tendulkar

లండన్ (యూకే): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టీ సారా టెండూల్కర్ తన స్నేహితురాళ్లతో కలిసి లండన్‌లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రాన్ని వీక్షించారు.(Sara Tendulkar) లండన్ నగరంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న సారా టెండూల్కర్ సినిమాహాలులో కూల్ డ్రింక్ తాగుతూ షారూఖ్ పఠాన్ సినిమాను(Pathaan) చూసి, ఆ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.సచిన్ టెండూల్కర్ కుమార్తె, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ స్నేహితురాళ్లతో కలిసి పఠాన్ మూవీ చూస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.

భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో(Indian cricketer Shubman Gill) సారా టెండూల్కర్ అనుబంధం(Sara Tendulkar Dating) ఉందని ఒకప్పుడు పుకార్లు వ్యాపించాయి.అయితే దీనిని ఇద్దరూ ధృవీకరించలేదు, లేదా ఖండించలేదు. పంజాబీ నటి సోనమ్ బజ్వాతో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్‌మాన్ తాను సారా అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు, కానీ ఇంటిపేరును వెల్లడించలేదు. ఆ సారా ఎవరనేది క్లారిటీ లేదు. గత సంవత్సరం బాలీవుడ్ నటి సారాఅలీ ఖాన్‌తో లంచ్ డేట్‌లో శుభ్‌మాన్ కనిపించారు. కాబట్టి అతని గర్ల్‌ఫ్రెండ్ సారాటెండూల్కర్ (Sara Tendulkar Education)లేదా సారాఅలీఖాన్ అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు.

Updated Date - 2023-01-28T10:14:15+05:30 IST