Ravanasura Teaser: ‘సీత కోసం ఈ రావణాసురుడ్ని దాటాలి’.. ఆకట్టుకుంటున్న రవితేజ మూవీ టీజర్

ABN , First Publish Date - 2023-03-06T14:29:03+05:30 IST

‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura).

Ravanasura Teaser: ‘సీత కోసం ఈ రావణాసురుడ్ని దాటాలి’.. ఆకట్టుకుంటున్న రవితేజ మూవీ టీజర్
Ravi Teja

‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్‌ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరో సుశాంత్‌ (Sushanth) కీలక పాత్ర చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంలో ఈ సినిమా టీజర్‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది.

Ravanasura.jpg

బజ్‌కి తగ్గట్లుగానే ఈ మూవీ టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఎవరు మంచి వారో, ఎవరూ చెడ్డవారో అర్థం కాకుండా టీజర్‌ని చాలా జాగ్రత్తగా కట్ చేశారు. ఈ సినిమాలో ‘పత్రి క్రిమినల్ వాడు చేసిన ప్రతి క్రైమ్ మీద వాడు సిగ్నేచర్ వదిలి వెళ్లిపోతాడు. లుక్ ఫర్ దట్ సిగ్నేచర్’.. ‘సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే మూవీ ఫుల్ మాస్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో సుధీర్ వర్మ మార్క్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దీంతో రవితేజ్ ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. అభిషేక్‌ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్‌లో బిగ్‌ బీకి గాయాలు

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-06T14:29:03+05:30 IST