Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..

ABN , First Publish Date - 2023-03-06T12:55:55+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.

Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..
Rana

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు. అవును.. ఇది నిజం. అయితే అది ఫ్యాషన్ పోలీసుల నుంచి లెండి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బాబాయ్ వెంకటేశ్ (Venkatest), అబ్బాయి రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి‘రానా నాయుడు (Rana Naidu)’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. అమెరికన్ వెబ్‌సిరీస్‌ రే డొన్నావన్‌ ఆధారంగా ఇది తెరకెక్కింది.

ఈ వెబ్‌సిరీస్ మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రానా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వచ్చే సమస్యలను తీర్చే వ్యక్తిగా నటిస్తున్నాడు. ఈ తరుణంలో ఈ సిరీస్ టీం ప్రమోషన్స్‌ని జోరుగా సాగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియోని విడుదల చేసింది.

ఆ వీడియోలో పోలీసుల వల్ల ఇబ్బంది పడుతున్నానని జాన్వీ కపూర్ రానాతో అంటుంది. అది విన్న రానా ఢిల్లీ నుంచి గోవా, పుణే వరకు ఏ ప్రాంత పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని జాన్వీని అడుగుతాడు. దానికి వాళ్లేవరూ కాదని, ఫ్యాషన్ పోలీసులని చెబుతుంది. అంతేకాకుండా.. ఎయిర్‌పోర్ట్‌కి వెళితే అందరి కళ్లు తన మీదే ఉంటున్నాయని, ఎన్ని ఫ్యాషన్స్ ట్రై చేసిన సరిపోట్లేదని విచారంగా చెబుతుంది. దాంతో రానా పైలెట్ అక్కడికి తీసుకొస్తాడు. వెంటనే పైలట్ తను ఎయిర్‌పోర్ట్‌కి రావొద్దని, ప్లెన్‌నే అక్కడికి తీసుకొస్తానని చెబుతాడు. అది విన్న జాన్వీ చాలా సంతోషపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-06T12:58:53+05:30 IST