Viral News: ఆ షాప్ ముందు పెట్టిన బోర్డు చూసి తిరిగి వెళ్లిపోతున్న కస్టమర్లు.. అయినా వెనక్కి తగ్గేదేలే అంటున్న యజమాని..

ABN , First Publish Date - 2023-07-16T12:29:05+05:30 IST

సాధారణంగా మనలో చాలామంది అలా టైమ్ పాస్ కోసం గ్రాసరీ స్టోర్స్‌, షాపింగ్ మాల్స్ (Shopping Malls) లాంటి వాటికి వెళ్తుంటారు.

Viral News: ఆ షాప్ ముందు పెట్టిన బోర్డు చూసి తిరిగి వెళ్లిపోతున్న కస్టమర్లు.. అయినా వెనక్కి తగ్గేదేలే అంటున్న యజమాని..

Viral News: సాధారణంగా మనలో చాలామంది అలా టైమ్ పాస్ కోసం గ్రాసరీ స్టోర్స్‌, షాపింగ్ మాల్స్ (Shopping Malls) లాంటి వాటికి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినపుడు జస్ట్ వాటిని చూసి ఎంజాయ్ చేయడం తప్పితే.. కొనేది ఏమీ ఉండదు. అలా చూసి వచ్చేస్తుంటారంతే. స్పెయిన్‌ (Spain) లోని బార్సిలోనాలో గల ఓ ప్రముఖ స్టోర్‌కు కూడా ఇలాగే కస్టమర్లు రావడం, షాప్ మొత్తం కలియతిరగడం వెళ్లిపోవడం చేసేవారు. ఇంకొందరు విలువైన వస్తువుల వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకోవడం చేసేవారు. స్టోర్‌కు వచ్చేవారిలో సగం మంది ఇలాగే చేసేవారట. దాంతో ఆ స్టోర్ యజమానికి చిర్రెత్తుకొచ్చింది. ఇలా అయితే కాదు అని ఆ షాపు ఓనర్ ఓ ఉపాయం ఆలోచించాడు. స్టోర్‌ ముందు ఒక బోర్డు ఏర్పాటు చేయించాడు. అంతే.. ఆ బోర్డు చూసి కస్టమర్లు లోపలి వెళ్లకుండానే షాపు బయటి నుంచే వెనక్కి వెళ్లిపోవడం మొదలైంది. ఇంతకీ ఆ బోర్డుపై ఏం రాసి ఉంది? ఎందుకు కస్టమర్లు ఆ బోర్డు చూసిన తర్వాత లోపలికి వెళ్లకుండా తిరిగి వెళ్లిపోతున్నారు? అనే వివరాలు తెలియాలంటే మీరు ఈ పూర్తి కథనం చదవాల్సిందే.

అది బార్సిలోనాలోని 'క్యూవియర్స్ ముర్రియా' (Queviures Murria) గ్రాసర్టీ స్టోర్. దాదాపు శతాబ్ద కాలంగా క్యూవియర్స్ ముర్రియా ప్రజల మన్ననలు పొందుతుంది. బార్సిలోనా (Barcelona) లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇది ఒకటి. స్టోర్ పాతకాలపు నిర్మాణశైలి, సాంప్రదాయ ఇంటీరియర్ రూపకల్పన ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. దాంతో ఆ స్టోర్‌లో కొనుగోళ్లు చేసేవారి కంటే కూడా కేవలం చూసి ఎంజాయ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యింది. ఎంతలా అంటే సగంలో సగం మంది కేవలం స్టోర్ లోపలి వస్తువులను చూడడం, సెల్ఫీలు దిగడం చేసేవారు.

Shocking: గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్‌.. చనిపోయిన తల్లి వాయిస్‌ వినిపించడంతో అతడికి షాక్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


Shop.jpg

ఇలా టైం పాస్ చేసే బ్యాచ్‌తో విసిగిపోయిన స్పానిష్ గ్రాసర్టీ స్టోర్ యజమానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశాడు. అదేంటంటే.. షాపులోకి అడుగుపెడితే రుసుము చెల్లించాల్సిందేనన్న కండిషన్. సో.. షాపులోకి వెళ్లాక.. అక్కడ ఏం కొనకపోయినా డబ్బులు కట్టాల్సి ఉంటుదన్నమాట. "కేవలం విండో షాపింగ్‌కు (Window Shopping) మాత్రమే వస్తే.. రూ.500 ఫైన్" అంటూ ఆ బోర్డుపై రాయించాడు స్టోర్ యజమాని.

అయితే, స్టోర్ ఓనర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏ తప్పు చేయని పర్యాటకులకు జరిమానా ఎలా విధిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈ విషయంలో యాజమాన్యం, అక్కడి స్టాఫ్ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలేదని ప్రకటించారు. స్టోర్‌కి వచ్చిన కస్టమర్లలో కనీసం 50 శాతం మంది కూడా అక్కడ ఏమీ కొనడంలేదంటూ వాపోతున్నారు. దాంతో ఈ నిర్ణయం తీసుకోవడం తప్పలేదని చెప్పుకొచ్చారు.

Gurdeep Kaur Chawla: ఎవరీ మహిళ..? ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారంటే చాలు.. పక్కన ఈమె ఉండాల్సిందే..!

Updated Date - 2023-07-16T12:31:18+05:30 IST