Viral Video: వీడసలు మనిషేనా?.. మహిళ మెడకు కుక్క గొలుసు.. దానికో తాళం..

ABN , First Publish Date - 2023-08-23T13:47:17+05:30 IST

అమెరికాలోని లూయిస్ విల్లే (Louisville) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కర్కోటకుడు మానవత్వం మరిచి మహిళను అత్యంత దారుణంగా హింసించాడు.

Viral Video: వీడసలు మనిషేనా?.. మహిళ మెడకు కుక్క గొలుసు.. దానికో తాళం..

Viral Video: అమెరికాలోని లూయిస్ విల్లే (Louisville) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కర్కోటకుడు మానవత్వం మరిచి మహిళను అత్యంత దారుణంగా హింసించాడు. ఆమె మెడకు కుక్క గొలుసు, దాకి తాళం వేసి బంధించాడు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నాష్‌విల్లే పరిధిలోని పార్క్ హిల్‌లో ఆగస్టు 16న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను బంధించిన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు ఆ కర్కోటకుడి చెర నుంచి విముక్తి లభించింది.

బాధితురాలు సాయం కోసం అరవడం ఆ ఇంటి పక్కన ఉండే వ్యక్తి విన్నాడు. దాంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వ్యక్తి సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా డిజిటల్ లాక్ కారణంగా డోర్లు తెరచుకోలేదు. దాంతో ఒక నిచ్చెన తెచ్చి ఇంటి కిటికీ గుండా లోపలికి వెళ్లారు. తీరా.. లోపలికి వెళ్లి చూస్తే షాకింగ్ దృశ్యం కనిపించింది. మహిళ మెడకు కుక్క గొలుసు ఉంది. దానికి ఓ పెద్ద తాళం కూడా వేసి ఉంది. గొలుసు రెండో చివర కింద నేలపై కట్టేసి ఉంది.

వెంటనే ఆ గొలుసును కట్ చేసి మహిళను ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కట్టర్ సాయంతో ఆమె మెడకు ఉన్న గొలుసును కట్ చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన మోయిసెస్ మే (Moises May) ను రెండు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కిడ్నాప్, వేధింపులతో పాటు ఇతర ఆరోపణలు మోపారు. అసలు అతడు ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Shocking Video: 'పైత్యం ఎక్కువైతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మరి'.. వధువు ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటో షూట్..!

Updated Date - 2023-08-23T13:48:49+05:30 IST